B.tech student died
-
Road Accident: డిగ్రీ పట్టా అందుకునేందుకు వెళ్తూ.. బీటెక్ విద్యార్థి మృతి
మేడ్చల్‌రూరల్: నాలుగేళ్ల బీటెక్ విద్యను పూర్తి చేసుకుని..ఆనందంగా గ్రాడ్యుయేట్ పట్టా అందుకునేందుకు కళాశాలకు బయలుదేరిన విద్యారి్థని రోడ్డు ప్రమాదం బలిగొన్నది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు, పోలీసుల వివరాల ప్రకారం... సంగారెడ్డి ప్రాంతానికి చెందిన సాయికుమార్ (23), అతని స్నేహితులు వినోద్, విజయ్‌లు కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్నారు. శుక్రవారం కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఏర్పాటు చేయగా డిగ్రీ పట్టాలు పొందేందుకు మిత్రులతో కలిసి సాయికుమార్ ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి నుంచి కళాశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో గౌడవెళ్లి సమీపంలో ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డులో దుండిగల్ వైపు నుండి సీఎంఆర్ కళాశాల వైపు వస్తుండగా ఓఆర్ఆర్ అండర్ పాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో మరో రోడ్డులో వెళ్తున్న లారీని ఢీ కొట్టారు. ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా వినోద్, విజయ్ తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా ప్రమాదంలో మరణించిన సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు దిగి..
బోధన్ టౌన్(బోధన్) : స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోధన్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్ చౌరస్తాకు చెందిన విశాల్ (21) బీటెక్ పూర్తి చేశాడు. తన మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి బోధన్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో గల స్విమ్మింగ్‌పూల్‌కు గత రెండు నెలల నుంచి వస్తున్నాడు. రోజూ లాగే గురువారం మధ్యాహ్నం సమయంలో తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌కు వచ్చాడు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగిన విశాల్.. ఎంతకూ పైకి రాలేదు. దీంతో మిత్రులు అతడ్ని బయటకు తీసి 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే, 108 వచ్చే సరికే విశాల్ మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి తుకారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి ఈత వచ్చని, ఈత వచ్చిన వ్యక్తి ఎలా మృతి చెందుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడికి మృతికి కారణమైన ఈతకొలను నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాల్ మృతికి గల కారణాలపై సీఐని వివరణ కోరగా.. పోస్టుమార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన బదులిచ్చారు. -
డెంగ్యూతో బీటెక్ విద్యార్థి మృతి
కాచిగూడ (హైదరాబాద్) : డెంగ్యూ జ్వరంతో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడలోని మున్నూరుకాపు హాస్టల్లో శనివారం జరిగింది. వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల అఖిల్(19) కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంలో ఉంటూ తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు మందులు వాడుతూ కాలేజీకి వెళ్లివస్తున్నాడు. కాగా పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృత్యువాతపడ్డాడు. -
పిడగుపాటుకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి
చిత్తూరు (చౌడేపల్లి): పిడుగుపాటుతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని లగిరిమిట్టపల్లికి చెందిన వెంకటరమణ, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు ఉమ్మిరాజు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు. రాత్రి వర్షం పడుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి దగ్గర ఉన్న సామానును లోపల వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో విద్యార్థి కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.