చిత్తూరు (చౌడేపల్లి): పిడుగుపాటుతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని లగిరిమిట్టపల్లికి చెందిన వెంకటరమణ, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు ఉమ్మిరాజు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు.
రాత్రి వర్షం పడుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి దగ్గర ఉన్న సామానును లోపల వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో విద్యార్థి కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.