సాక్షి, బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సిద్దరామయ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భారత వ్యతిరేక సంస్థ అయిన ఎస్పీడీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)పై నమోదైన కేసులను ఎందుకు ఎత్తివేశారని సిద్దరామయ్యను ప్రశ్నించారు. బుధవారం కర్ణాటకలోని చిత్తదుర్గలో పర్యటించిన అమిత్‌షా మాట్లాడారు.
'కేంద్రం కర్ణాటకకు ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఐదేళ్ల కిందట పూరి గుడిసెలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు నాలుగంతస్తుల ఇళ్లు కట్టుకొని.. ఖరీదైన కార్లు ఇంటి ముందు పార్క్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి' అని అమిత్‌షా ప్రశ్నించారు.
'కర్ణాటకకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏం చేసిందని సీఎం ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు వచ్చాను. 13 ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా యూపీఏ ప్రభుత్వం హయాంలో కర్ణాటకకు రూ. 88,583 కోట్లు ఇస్తే.. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ఎన్డీయే ప్రభుత్వం కర్ణాటకకు రూ. 2 లక్షల19 కోట్లు ఇచ్చింది' అని అమిత్ షా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment