అంబులెన్స్లో పెళ్లాడిన నేత్రావతి
దేవనాగరి: నేత్రావతి ఒకటనుకుంది. విధి మరోలా ఎదురైంది. శరీరాన్ని కదల్చలేని పరిస్థితిలోకి లోనైంది. అయితేనేం విధిని ఎదిరించి, కలల తన కలల రాకుమారుడిని పెళ్లాడింది. కదలలేని స్థితిలో అంబులెన్స్ లో పడుకునే తాళి కట్టించుకుంది. 19 ఏళ్ల నేత్రావతికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ నేత్రావతి సొంత ఊరు. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన ఈమె నర్సింగ్ డిప్లమా థర్డ్ ఇంయర్ చదువుతోంది. కొన్నేళ్ల కిందట ఆమెకు అదే ఊరికి చెందిన గురుస్వామితో పరిచయం ఏర్పడింది. అతను విండ్ మిల్లులో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. పరిచయం ప్రేమగా మారింది. కులాలు ఒక్కటైనా పెద్దలు పెళ్లికి నో చెప్పారు. దీంతో ప్రేమికుల పాటితి దైవం లాంటి మురుగరాజేంద్ర స్వామి నిర్వహించే సామూహిక వేడుకలో వివాహం చేసుకోవాలనుకున్నారు.
పెళ్లి ఇంకో వారం ఉదనగా నేత్రావతి తన ఇంట్లో పొరపాటున కాలుజారి పడిపోయింది. వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగిలి, కదలలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. పెళ్లి ఆగిపోవటం ఇష్టంలేని అంబులెన్స్ లోనే మఠానికి వచ్చి ప్రియుడితో తాళి కట్టించుకుంది. ఈ వేడుకను పలు మీడియా సంస్థలు ప్రత్యక్షప్రసారం చేశాయికూడా. కులరహిత సమాజం కోసం పోరాడుతున్న మురుగరాజేంద్ర స్వామి ఇప్పటివరకు తన మఠంలో 23 ప్రేమ పెళ్లిళ్లు జరిపించారు. చిత్రదుర్గ ప్రాంతంలో పారిపోయి పెళ్లిచేసుకోవాలనుకునే యువతకు అండగా నిలుస్తారాయన. నేత్రావతి పూర్తిగా కోలుకోవడానికి కొద్ది నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు.