guruswamy
-
అత్తను నరికిన అల్లుడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అత్తను ఆమె అల్లుడే కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నైనవరం ఫ్లై ఓవర్‌పై శనివారం రాత్రి చోటుచేసుకుంది. మామను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. వేగంగా బైక్ నడిపి తప్పించుకోగలిగాడు. ఈ ఘటన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన గోగుల నాగమణి (50), గురుస్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం కాగా, రెండో కుమార్తె లలితను ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా రాజేశ్, లలిత మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. అప్పటి నుంచి లలిత పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కేసు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో రాజేశ్ తన అత్త, మామలను చంపేందుకు ప్లాన్ చేశాడు. కాలనీ నుంచే అత్తమామలను వెంబడించి.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో వైఎస్సార్ కాలనీ నుంచి సాయిరాం థియేటర్ వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి నాగమణి, గురుస్వామి బైక్‌పై బయలుదేరారు. వీరి బైక్‌ను ఇంటి నుంచే రాజేశ్ మరో వ్యక్తితో కలిసి మరో ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. నైనవరం ఫ్లై ఓవర్ మధ్యన ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి బైక్ వెనుక కూర్చున్న రాజేశ్ అత్త నాగమణిపై కత్తితో వేటు వేశాడు. భుజంపై కత్తి వేటుపడగా.. నాగమణి పెద్దగా కేకలు వేస్తూ కిందపడిపోయింది. దీంతో ఆమె మెడపై కత్తితో నరికాడు. అదే సమయంలో బైక్‌పై ఉన్న గురుస్వామి భయంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లి తప్పించుకున్నాడు. కాగా, రక్తం మడుగులో పడి ఉన్న నాగమణి కొద్దిసేపు గాయాలతో విలవిల్లాడింది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. నాగమణి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫ్లై ఓవర్‌కు మూడు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు రాజేశ్, అతడికి సహకరించిన వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
‘మహర్షి’ ఫేం నటుడు గురుస్వామి మృతి
కర్నూలు కల్చరల్: ‘మహర్షి’ ఫేం నటుడు, కర్నూలుకు చెందిన మిటికిరి గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆయనకు 15 రోజుల కిందట బ్రె యిన్ స్ట్రోక్ రాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొంది, మూడు రోజుల కిందట కర్నూలు బాలాజీనగర్‌లోని స్వగృహానికి వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లోనే వైద్యం చేయిస్తుండగా, మృతిచెందారు. గురుస్వామి బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నాటకాలపై అభిరుచితో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటుడిగా ఎదిగారు. మహేష్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రంలో రైతు పాత్రలో అద్భుతంగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత వరుసగా భీష్మ, ఉప్పెన, వకీల్‌సాబ్, రిపబ్లిక్, చలో ప్రేమిద్దాం, రంగస్వామి... తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. చదవండి: ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు -
ప్రభాస్‌తో తలపడనున్న కన్నడ నటుడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్రం "సలార్". శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారని అప్పట్లో ఫిలింనగర్లో పుకార్లు వ్యాపించాయి. కానీ దీనిపై నటుడు గానీ, అటు చిత్రయూనిట్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది వుట్టి పుకారుగానే మిగిలిపోయింది. తాజాగా ఇందులో విలన్‌గా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. తమిళ నటుడు మధు గురుస్వామి హీరోతో తలపడుతాన్న వార్త టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. సలార్ సినిమాలో భాగమవుతున్న విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. సలార్‌లో పని చేస్తుండటం సంతోషంగా ఉందంటూనే తనకీ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఏ హర్హ దర్శకత్వం వహించిన 'వజ్రకాయ' సినిమాతో గురుస్వామి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తెచ్చిన గుర్తింపుతో కన్నడతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశాడు. సలార్ చిత్రానికి పలువురు కన్నడ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా సినిమాటోగ్రఫీ భువన్‌గౌడ, కంపోజ్ రవి బర్సూర్ అందరూ కన్నడిగులే. ఇక ఈ మధ్యే 'సలార్' షూటింగ్ రామగుండంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న గోదావరిఖనిలోని శ్రీనగర్ వద్ద టీమ్ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక అదే రోజు ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో వేసిన 'ఆదిపురుష్' సెట్లోనూ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. చదవండి: సలార్ షూటింగ్: ప్రాణాలను పణంగా పెట్టిన అభిమానం చదవండి: సలార్ : శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్! -
స్త్రీసెవంటీసెవన్
కోరలు ఉన్నప్పుడు అది సెక్షన్ 377. కోరలు తీసేశాక స్త్రీసెవంటీసెవన్. అవును! ఈ చరిత్రాత్మక కేసును గెలిచిన బృందంలోని సారథ్య స్త్రీకి ఈ క్రెడిట్‌ను ఇవ్వాల్సిందే. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 తలవంచింది. ఇంద్రధనుస్సు జెండా రెపరెపలాడింది! ఈ న్యాయ పోరాటాన్నే కాదు, ఎల్జీబీటీల మనసుల్నీ గెలిచిన ధీర వనిత మేనకా గురుస్వామి. కేసును వాదించి గెలిపించిన ఆల్ మెన్ లాయర్స్ టీమ్‌లో ఒకే ఒక్క మహిళ! మనుషులంతా సమానమే అని నమ్మే ప్రతి ఒక్కరి ప్రశంసలూ అందుకుంటున్న ఈ మానవీయ న్యాయవాది గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. మేనక హైదరాబాద్‌లో పుట్టింది. ఢిల్లీలో పెరిగింది. చదరంగం ఆటంటే చాలా ఇష్టం ఆమెకు. లా చదువుతున్నప్పుడే ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ కావాలనుకుంది. టీన్స్‌లో ఉన్నప్పుడు.. పాప్ సింగర్ మడోన్నాకు బ్యాకప్ సింగర్ కావాలని పాటలు, డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. ‘‘నీకంత టాలెంట్ లేదు ఆపు’’ అంటూ కజిన్స్ ఆమె ఆశల మీద నీళ్లు పోశారు. ‘‘సన్నగా ఉన్న నేను స్టెప్పులేస్తుంటే.. స్కెలిటన్ డాన్స్ చేస్తున్నట్టుంది అంటూ నవ్వేవాళ్లు నా కజిన్స్, ఫ్రెండ్స్’’ అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటుంది మేనక. మైండ్‌లో ఫిక్సైపోయింది మేనకకు పుస్తకాలు చదవడమంటే చిన్నప్పటి నుంచీ ఆసక్తి. ప్రముఖ రచయిత జేమ్స్ బాల్డ్విన్ చెప్పిన ‘‘ఎదురైన ప్రతి పరిస్థితీ మారకపోవచ్చు.. కాని పరిస్థితులను ఎదుర్కోనిదే ఏ మార్పూ సాధ్యంకాదు’’ అనే మాటలను మైండ్‌లో ఫిక్స్ చేసుకుంది. అందుకే మడోన్నా, చెస్లను ఛస్ అనుకొని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలో బిఏ ఎల్ఎల్బీ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బీసీఎల్, హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్మ్ పట్టా పుచ్చుకుంది. అంతకన్నా విశేషం మేనకా రోడ్స్ (ఖజిౌఛ్ఛీట) స్కాలర్. ఆక్స్‌ఫర్డ్‌లోని రోడ్స్ (ఖజిౌఛ్ఛీట) హౌజ్‌లోని మిల్నర్ హాల్లో ఆమె చిత్రపటాన్ని కొలువుదీశారు. ఈ అరుదైన గౌరవం దక్కిన తొలి భారతీయ మహిళ ఆమే. ఆక్స్‌ఫర్డ్‌లో సివిల్ లా చదువుతున్నప్పుడు ఆ హాల్ వెంట నడుస్తూ చాలాసార్లు అనుకునేదట.. ఎందుకు ఈ హాల్లో నాలాంటి ఒక్క మహిళా పోట్రైట్ కనిపించదు? అని. ఆ టైమ్‌లో మేనక కనీసం ఊహించి కూడా ఉండదు తర్వాత కాలంలో తన పోట్రైటే అక్కడ ఉంటుందని. ధారపోసేందుకే తిరిగి రాక లా చదువుతున్నప్పడే ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటినీ అధ్యయనం చేసింది మేనక. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న విషయాన్నీ గ్రహించింది. న్యాయశాస్త్రం చదివాక అమెరికా వెళ్లింది. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా లో ఫ్యాకల్టీగా న్యాయశాస్త్రం బోధిస్తూనే ఇంకోవైపు యునైటెడ్ నేషన్స్‌కి హ్యూమన్‌రైట్స్ కన్సల్టెంట్‌గా పనిచేసింది. క్షణం తీరికలేకుండా అమెరికాలో బిజీగా ఉంది కాని మేనక మనసంతా ఇండియాలోనే. ఎందుకంటే ఆమెకు కాన్స్టిట్యూషనల్ లా.. ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా అంటే ప్రాణం. రాజ్యాంగం కల్పించే హక్కుల పరిరక్షణ కోసమే తన కెరీర్‌ను ధారపోయాలనుకుంది అందుకే భారతదేశానికి తిరిగొచ్చేసింది. సుప్రీంకోర్ట్ అడ్వొకేట్‌గా ఢిల్లీలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. తొలి యుద్ధం.. విద్యహక్కు కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఎన్ని దుర్వినియోగ మవుతున్నాయో తెలుసుకుంది మేనక. వాటి పోరుకి సిద్ధపడింది. అలాంటి వాటిల్లో ఆమె ఎక్కుపెట్టిన తొలి అస్త్రం రైట్ టు ఎడ్యుకేషన్. పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇవ్వాలనే నియమం వచ్చింది మేనక వల్లే. ‘‘అయితే ఇప్పటికీ చాలాచోట్ల ప్రైవేట్ స్కూళ్లు ఆ రూల్‌ని అమలు చేయట్లేదు. పేద పిల్లలకు సీట్ ఇవ్వాల్సి వస్తుందని తమ స్కూళ్లను మైనారిటీ స్కూళ్లుగా మార్చేసుకున్న వాళ్లూ ఉన్నారు. దీని మీద ఇంకా వర్క్ చేయాలి’’ అంటుంది ఆమె. వృత్తి పట్ల అంత నిబద్ధత మేనకకు. తన 20 ఏళ్ల కెరీర్లో విజయం సాధించిన కేసులెన్నో. ఇప్పుడీ.. సెక్షన్ 377 వలస పాలకులు తమ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని చట్టాలంటే మేనకా గురుస్వామికి గుర్రు. కాలం చెల్లిన ఆ చట్టాల్లో సెక్షన్ 377 ఒకటి. కాదు.. ముఖ్యమైనది. దాని ప్రకారం సమానత్వపు హక్కుకు దూరమై సమాజం దృష్టిలో హేళనకు గురవుతున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలిచింది. వాళ్లు చేస్తున్న పోరాటానికి న్యాయ సహాయం అందిస్తున్న బృందంలో ఏకైక మహిళగా ముందుంది. వాళ్లకు మద్దతుగా వాదించింది. పర్యవసానమే.. మొన్న, ‘హోమోసెక్సువాలిటీ నేరం కాదు’ అంటూ సుప్రీంకోర్టు సెక్షన్ 377ను çసడలించడం. అది ఎల్జీబీటీలకు మేనక అందించిన గెలుపు. ఎల్జీబీటీ కమ్యూనిటీ కూడా మానవ సమూహమే.. వాళ్లకు గౌరవం అందాలని వాదించింది ఆమె. ప్రయాణాలు అంటే ప్రాణం నేపాల్ వంటి దేశాల రాజ్యాంగ రచనలో సహకారం అందించిన మేనకా యేల్ వంటి యూనివర్సిటీల్లో గెస్ట్ ప్రొఫెసర్‌గా న్యాయ పాఠాలు చెప్పేందుకు వెళుతుంటారు. ట్రావెలింగ్ ఆమె అభిరుచి. వియాన్నా, కేప్ టౌన్, టోక్యో, న్యూయార్క్ ఆమె ఫేవరేట్ ప్లేసెస్. ప్రపంచంలోని ప్రతి మూలా చుట్టి రావాలని ఆమె సంకల్పం. కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే ఇష్టం. ‘‘వృత్తిలో భాగంగా చాలా దేశాలు, ఊళ్లూ తిరుగుతాను. కానీ ఢిల్లీ అంటే పడి చచ్చిపోతా. చలికాలం రాత్రుళ్లు ఇక్కడి చారిత్రక కట్టడాలను చూస్తూ ఆ పేవ్మెంట్స్ మీద నడవడమంటే పిచ్చి సరదా. అసలు నన్ను ఈ దేశానికి రప్పించిన రీజన్స్‌లో ఇదీ ఒకటి కావచ్చు’’ అంటుంది. బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్? అని అడిగితే.. ‘‘న్యాయమైన తీర్పులో భాగమైనవన్నీ. అఫ్కోర్స్ అలాంటి సందర్భాలు తక్కువే కావచ్చు.. కానీ ఉంటాయి. అలాంటి తీర్పు వచ్చినప్పుడల్లా సంతోషంగా ఉంటుంది’’ అని చెప్తుంది మేనక. ‘‘లా .. వండర్ఫుల్ ప్రొఫెషన్. కాని ఈ దేశంలో ఓ మహిళగా.... మహిళా లాయర్‌గా.. నీ మనసు ఏం చెబుతుందో అదే వినాలి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. లేకపోతే ‘‘ఆడపిల్లవు.. నువ్వేం చేయగలవు.. నీకు ఇది అవసరమా’’ అంటూ అనుక్షణం వెనక్కిలాగే ఈ సొసైటీని జయించలేం. మన మీద మనకు నమ్మకం చాలా ఉండాలి.. అప్పుడే ఇలాంటివన్నీ ఓవర్‌కమ్ చేయగలం’’ అని తాను ఆచరించే సత్యాన్ని బయటపెట్టింది మేనకా గురుస్వామి. – శరాది -
భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
నల్గొండ: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కే అజిత్ సింహారావు బుధవారం తీర్పు ఇచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గురుస్వామికి, దామరచర్లకు చెందిన నాగమణికి 2006లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం హుజూర్‌నగర్‌లో కాపురం ఉన్న వీరు.. ఆ తర్వాత అత్తగారి ఊరైన దామరచర్లకు మకాం మార్చారు. భార్యపై అనుమానం పెంచుకున్న గురుస్వామి 2011 సంవత్సరం నవంబర్ 11న ఆమె గొంతు నులిమి చంపాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
నేటి నుంచి తైక్వాండో పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాపోటీలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. క్రీడా పోటీలు స్థానిక ఇండోర్ స్టేడియంలో జరుగనున్నట్లు చెప్పారు. ఓపెన్ సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27న ఉదయం 9 గంటలకు ఇండోర్ స్టేడియంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ : 7382440946లో సంప్రదించాలన్నారు. -
అంబులెన్స్‌లో పెళ్లాడిన నేత్రావతి
దేవనాగరి: నేత్రావతి ఒకటనుకుంది. విధి మరోలా ఎదురైంది. శరీరాన్ని కదల్చలేని పరిస్థితిలోకి లోనైంది. అయితేనేం విధిని ఎదిరించి, కలల తన కలల రాకుమారుడిని పెళ్లాడింది. కదలలేని స్థితిలో అంబులెన్స్ లో పడుకునే తాళి కట్టించుకుంది. 19 ఏళ్ల నేత్రావతికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ నేత్రావతి సొంత ఊరు. సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన ఈమె నర్సింగ్ డిప్లమా థర్డ్ ఇంయర్ చదువుతోంది. కొన్నేళ్ల కిందట ఆమెకు అదే ఊరికి చెందిన గురుస్వామితో పరిచయం ఏర్పడింది. అతను విండ్ మిల్లులో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. పరిచయం ప్రేమగా మారింది. కులాలు ఒక్కటైనా పెద్దలు పెళ్లికి నో చెప్పారు. దీంతో ప్రేమికుల పాటితి దైవం లాంటి మురుగరాజేంద్ర స్వామి నిర్వహించే సామూహిక వేడుకలో వివాహం చేసుకోవాలనుకున్నారు. పెళ్లి ఇంకో వారం ఉదనగా నేత్రావతి తన ఇంట్లో పొరపాటున కాలుజారి పడిపోయింది. వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగిలి, కదలలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. పెళ్లి ఆగిపోవటం ఇష్టంలేని అంబులెన్స్ లోనే మఠానికి వచ్చి ప్రియుడితో తాళి కట్టించుకుంది. ఈ వేడుకను పలు మీడియా సంస్థలు ప్రత్యక్షప్రసారం చేశాయికూడా. కులరహిత సమాజం కోసం పోరాడుతున్న మురుగరాజేంద్ర స్వామి ఇప్పటివరకు తన మఠంలో 23 ప్రేమ పెళ్లిళ్లు జరిపించారు. చిత్రదుర్గ ప్రాంతంలో పారిపోయి పెళ్లిచేసుకోవాలనుకునే యువతకు అండగా నిలుస్తారాయన. నేత్రావతి పూర్తిగా కోలుకోవడానికి కొద్ది నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. -
తుర్కపల్లిలో మహిళ హత్య..!
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని తుర్కపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురువారం జరిగింది. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, శామీర్‌పేట్ పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజమాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన సూరి నర్సమ్మ(43), రాజయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నర్సమ్మ భర్త మృతిచెందాడు. ఈక్రమంలో ఆమె బతుకుదెరువు కోసం పిల్లలను తీసుకొని శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లికి వలస వచ్చింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ సీజన్‌పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. మూడేళ్ల క్రితం తుర్కపల్లికి చెందిన జీడిపల్లి గురుస్వామితో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం గురుస్వామి ఇంట్లో తెలిసింది. పలుమార్లు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో బుధవారం రాత్రి నర్సమ్మ, గురుస్వామి తుర్కపల్లి శివారులోని ఓ దాబా వెనక ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న గురుస్వామి భార్య తులసమ్మ, కుమారుడు శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. తులసమ్మ, శ్రీకాంత్ నర్సమ్మను తీవ్రంగా చితకబాదారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో వారు నర్సమ్మను ఓ ఆటోలో తీసుకొచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలేసి వెళ్లారు. నర్సమ్మ కుమారుడు రాజశేఖర్ గమనించి తల్లిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. కొద్దిసేపటికే నర్సమ్మ మృతిచెందింది. శామీర్‌పేట్ పోలీసులు, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు గురుస్వామి, ఆయన భార్య తులసమ్మతో పాటు కుమారుడు శ్రీకాంత్‌లను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.