
కర్నూలు కల్చరల్: ‘మహర్షి’ ఫేం నటుడు, కర్నూలుకు చెందిన మిటికిరి గురుస్వామి (80) శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆయనకు 15 రోజుల కిందట బ్రె యిన్ స్ట్రోక్ రాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొంది, మూడు రోజుల కిందట కర్నూలు బాలాజీనగర్‌లోని స్వగృహానికి వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లోనే వైద్యం చేయిస్తుండగా, మృతిచెందారు.
గురుస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నాటకాలపై అభిరుచితో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటుడిగా ఎదిగారు. మహేష్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రంలో రైతు పాత్రలో అద్భుతంగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత వరుసగా భీష్మ, ఉప్పెన, వకీల్‌సాబ్, రిపబ్లిక్, చలో ప్రేమిద్దాం, రంగస్వామి... తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.
చదవండి: ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు
Comments
Please login to add a commentAdd a comment