భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
Published Wed, Mar 22 2017 5:27 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
నల్గొండ: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కే అజిత్ సింహారావు బుధవారం తీర్పు ఇచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గురుస్వామికి, దామరచర్లకు చెందిన నాగమణికి 2006లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం హుజూర్‌నగర్‌లో కాపురం ఉన్న వీరు.. ఆ తర్వాత అత్తగారి ఊరైన దామరచర్లకు మకాం మార్చారు.
భార్యపై అనుమానం పెంచుకున్న గురుస్వామి 2011 సంవత్సరం నవంబర్ 11న ఆమె గొంతు నులిమి చంపాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
Advertisement
Advertisement