Bengaluru: Drug Addict Techie Forces Wife To Sleep With Friends - Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం

Dec 10 2022 6:59 PM | Updated on Dec 10 2022 8:47 PM

Bengaluru: Drug Addict Techie Forces Wife To Sleep With Friends - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

బెంగళూరు: కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భర్తే.. భార్యను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఇతరులతో పడక పంచుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. సంపిగేహళ్లికి చెందిన వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 2011లో వివాహం జరిగింది. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటు పడిన భర్త.. భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు.

స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో చిత్ర హింహలకు గురిచేశాడు. మద్యం మత్తులో ఆమెను కొట్టేవాడు. భార్య మరొకరితో బెడ్‌రూంలో గడిపిన దృశ్యాలను వీడియో రికార్డ్‌ చేసి రాక్షసానందం పొందాడు. భర్తతో విసిగిపోయిన భార్య.. అతని నుంచి విడాకులు  కోరగా.. తన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు.

దీంతో దిక్కుతోచని వివాహిత చివరికి పోలీసులను ఆశ్రయించింది. భర్త తన ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం తన ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేసిన వీడియో చూపించి బ్లాక్‌మెయిల్‌ చేశాడని తెలిపింది. భర్త డ్రగ్స్‌ అలవాటు పడి,  ఇంట్లోని పూల కుండీలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిపింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement