Kangana Ranaut Wants Ranbir Kapoor, Ranveer Singh, Vicky kaushal and Ayan Mukerji to Take Drug Test | వాళ్లంతా డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి, కంగనా - Sakshi
Sakshi News home page

వాళ్లంతా డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి: కంగనా

Published Wed, Sep 2 2020 3:13 PM | Last Updated on Wed, Sep 2 2020 3:58 PM

Kangana Ranaut Asks Ranbir Kapoor and Others Take Drug Test - Sakshi

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని సంచలన  వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా మరో షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈసారి వ్యక్తుల పేర్లను ప్రస్తవిస్తూ టార్గెట్‌ చేసింది. ‘రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌషల్ ‘కొకైన్ బానిసలు’ అని పుకార్లు ఉన్నాయి. వీరందరూ డ్రగ్‌ టెస్ట్‌ కోసం బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చి ఈ పుకార్లకు స్వస్తి పలకాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. క్లియర్‌ శాంపిల్స్‌తో ఈ యువ నటులందరూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని కంగనా తన ట్వీట్‌లో పేర్కొంది. 

ఇక ఈ ట్వీట్‌పై కాలమిస్ట్‌ ఆశ్విని మహాజన్‌ స్పందిస్తూ ‘నేషనల్‌ అవార్డుకు ఎంపిక చేసేముందు ఆ ఆర్టిస్ట్‌లందరికి డ్రగ్‌ టెస్ట్‌ చేయాలంటూ కంగనా మంచి డిమాండ్‌ చేశారు. అలాంటివారు మనకు రోల్‌ మోడల్స్‌ ఎలా అవుతారు’ అని ట్వీట్‌ చేశారు. గత ఏడాది రాజకీయ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా కరణ్ జోహార్ పార్టీకి చెందిన ఒక వీడియోను షేర్‌ చేస్తూ ఆ వీడియోలోని వారందరూ  డ్రగ్స్‌ తీసుకున్న స్థితిలోనే ఉన్నారు అంటూ ట్వీట్‌ చేశారు.  ఈ వీడియోను కరణ్‌ జోహార్‌ ఇంట్లో తీశారు. దీనిని మొదట కరణ్‌ జోహారే షేర్‌ చేశారు.  ఈ వీడియోలో రణబీర్, అయాన్, విక్కీ, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ తదితరులు ఉన్నారు.


 దీని కరణ్‌ స్పందిస్తూ వారు డ్రగ్స్‌ తీసుకొని వుంటే నేను ఎందుకు దానిని షేర్‌ చేస్తాను అంటూ ప్రశ్నించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారు అన్న కంగనా ఆరోపణలపై  ఇటీవల రవీనా టాండన్, హన్సాల్ మెహతా స్పందించారు. బాలీవుడ్‌లోని ప్రతి ఒక్కరికి దానిని అపాదించడం అన్యాయమని వారు అన్నారు.  ఇతర వృత్తులలో ఉన్నట్లుగానే చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని వారు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 చదవండి: ఇంట‌ర్వ్యూ త‌ర్వాత అమ్మ ఏడుస్తూనే ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement