Kangana Ranaut Calls Ranbir Kapoor-Alia Bhatt Marriage Was Fake - Sakshi

Kangana Ranaut: పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. ఆలియా, రణ్‌బీర్‌ జంటపై సంచలన కామెంట్స్!

Published Tue, Jul 18 2023 3:48 PM | Last Updated on Tue, Jul 18 2023 4:39 PM

Kangana Ranaut Call Ranbir Kapoor-Alia Bhatt's Marriage Was Fake - Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడు ఏదో ఒక కామెంట్స్ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. గతంలో బాలీవుడ్ జంట ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌పై పలుసార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది. పరోక్షంగా ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జంటను ఉద్దేశించి ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అయితే తాజాగా విజయ్ సేతుపతితో కలిసి కంగనా ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే నెట్టింట్లో వచ్చిన స్క్రీన్‌షాట్‌లను షేర్ షేర్ చేస్తూ పరోక్షంగా విమర్శలు చేసింది.

(ఇది చదవండి: అడల్డ్ మూవీ 'బార్బీ'.. సెన్సార్‌ ఓకే.. కానీ ఓ కండీషన్ ..!)

ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ.. 'నేను ఎప్పుడైనా సినిమా ప్రకటించినప్పుడు నాతో పాటు సహానటులను కించపరిచేలా హెడ్‌లైన్స్ పెడుతున్నారు. అసహ్యమైన బల్క్ మెయిల్స్ పంపుతూ ప్రచారం చేస్తున్నారు. అన్ని పేపర్లలో ప్రతి చోటా ఒకే హెడ్‌లైన్ ఎలా వస్తుంది. దీన్ని బల్క్ మాస్ మెయిల్ అంటారు. నన్ను చూసి మీరు బాధపడితే.. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. భగవాన్ వారి ఆత్మకు శాంతి చేకూర్చండి. ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్న చెంగుమంగు గ్యాంగ్‌కు ఒక్కటే చెబుతున్నా. నన్ను చూస్తే మీకెందుకు అంత అసూయ కలుగుతోంది.' అంటూ రాసుకొచ్చింది. 

కంగనా మరో పోస్ట్‌లో రాస్తూ..' బాలీవుడ్ జంట వేరు వేరు అంతస్తులలో నివసిస్తున్నారు. కానీ బయటికి మాత్రం కలిసి ఉన్నట్లు నటిస్తారు. మింత్రా బ్రాండ్‌ను తమ సొంతం అంటూ.. నా సినిమా గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు . ఇటీవలి అతను కుటుంబసభ్యులతో కలిసి లండన్‌ ట్రిప్‌ వెళ్లిగా.. భార్య ఆలియా భట్, కుమార్తె రాహా ఇండియాలో ఉన్నారు. కానీ దాని గురించి ఎవరూ వ్రాయలేదు. కానీ ఆమె భర్త మాత్రం కలవాలని ఆమెను వేడుకుంటున్నట్లు మెసేజ్‌లు పంపుతున్నాడని' చెబుతోంది.'  

మరోవైపు ఇన్‌స్టాలో రాస్తూ.. 'సినిమా ప్రమోషన్స్, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే జరుగుతుంది. అతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నందుకు ప్రతిఫలంగా సినిమాల్లో అవకాశమిస్తానని అతను హామీ ఇచ్చాడు. ఇప్పుడు తను ఈ నకిలీ వివాహం నుంచి విముక్తి పొందాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. కానీ పాపం ఇప్పుడు అతనికి ఎవరూ లేరు. ఇకనుంచి తన భార్య, కుమార్తెపై దృష్టి పెట్టాలి. ఇండియాలో ఒకసారి పెళ్లయితే అంతా అయిపోనట్లే.. ఆబ్ సుధార్ జావో.' అని రణ్‌బీర్‌ను ఉద్దేశించి కౌంటరిచ్చింది. 

(ఇది చదవండి: పెళ్లి చేసుకోవాలనుంది, నాకంటూ ఓ కుటుంబం కావాలి: కంగనా)

గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే. తన గురించి ఫోటోగ్రాఫర్‌లకు ఎలా సమాచారం అందుతుంది అని ప్రశ్నించింది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం లీకవుతోందని కూడా ఆమె ఆరోపించింది. కాగా.. కంగనా తదుపరి చిత్రం 'తేజల్‌లో కనిపించనుంది. అంతేకాకుండా ఆమె తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎమర్జెన్సీ'లో నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. ఆ తర్వాత 'చంద్రముఖి 2'లోనూ కీలకపాత్ర పోషించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement