సాక్షి, ముంబై: ఇటీవలస్టాక్‌మార్కెట్లను లీడ్ చేస్తున్న ఫార్మా సెక్టార్ పరుగు శుక్రవారం కూడా కొనసాగింది. దాదాపు అన్ని మిడ్,స్మాల్ క్యాప్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా డా.రెడ్డీస్ భారీగా లాభపడుతోంది. మాదకద్రవ్యాల చికిత్సలో వినియోగించే సుబోగ్జోన్ ఔషధానికి జనరిక్ వెర్షన్ అయిన బ్యుప్రినార్ఫిన్ అండ్ నాలోక్సోన్ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ తుది అనుమతి లభించింది. దీంతో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబ్ కౌంటర్ దాదాపు 5శాతానికి పైగా లాభపడింది.
తమ డ్రగ్‌కు అమెరికా ఆరోగ్య నియంత్రణా సంస్థ తుది ఆమోదం లభించిందనీ ఓపియాడ్‌కు అలవాటు పడిన వారిలో ఈ మత్తుమందునునిలిపివేయడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను సుబాగ్జోస్(బుప్రోనోర్ఫిన్ అండ్ నలోగాన్) నిరోధిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2-8 మి.గ్రా మోతాదుల్లో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలిపింది. సుబోగ్జోన్ ఔషధ జనరిక్ వెర్షన్‌కు భారీ డిమాండ్ ఉంటుందున్న అంచనాలతో డాక్టర్ రెడ్డీస్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలో ఒపియాడ్ డ్రగ్ వినియోగం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో రెడ్డీస్‌కు చెందిన ఈ డ్రగ్‌ను అనుమతి లభించడం విశేషం. కాగా లాభనష్టాల మధ్య కొనసాగుతున్న ఈక్విటీ మార్కెట్‌లో ఫార్మా రంగ షేర్లు లుపిన్, సన్ ఫార్మా, అరబిందో, సిప్లా, పిరమల్, బయోకాన్ లాంటి ఇతర షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment