డ్రగ్స్‌ వాడటం వన్‌ వే Telangana focus on drug gangs | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ వాడటం వన్‌ వే

Published Fri, Jun 28 2024 6:21 AM | Last Updated on Fri, Jun 28 2024 6:21 AM

Telangana focus on drug gangs

ఒక్కసారి అలవాటు పడితే వెనక్కి రావడం కష్టం

‘సాక్షి’తో ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సచిన్‌ గోర్పడే 

12 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులతో అప్రమత్తం

వీరి ప్రవర్తనలో తేడాలు వస్తే అనుమానించాల్సిందే

ప్రత్యేక వ్యూహంతో డ్రగ్స్‌ ముఠాలకు చెక్‌ చెబుతున్నాం

డ్రగ్స్‌ వాడటం అనేది వన్‌వే లాంటిది. ఒక్కసారి ఆ దారిలోకి వెళ్లి వాటికి బానిసలుగా మారితే తిరిగి వెనక్కి రావడం అనేది చాలా కష్టం’ అని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సచిన్‌ గోర్పడే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను నిరోధించడానికే ‘ఎవిడెన్స్‌ ఈజ్‌ క్లియర్‌.. ఇన్వెస్ట్‌ ఇన్‌ ప్రివెన్షన్‌’ (డ్రగ్స్‌ వాడటంపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. నిరోధంపై దృష్టి పెట్టండి) అనే థీమ్‌తో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సచిన్‌ గోర్పడే గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్‌

ఇతర దేశాల ఏజెన్సీలతోనూ సమన్వయం
ఎన్సీబీ కేవలం డ్రగ్స్‌ నిరోధం కోసమే కాకుండా వీటి విని యోగానికి వ్యతిరేకంగా అవ గాహన కల్పించడానికి కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 26 ఎన్సీబీ జోనల్‌ కార్యాల యాలు ఉన్నా యి. మాదక ద్రవ్యాలు అనేవి మన దగ్గర వరకు వచ్చేశాయి. అనేక మంది విద్యా ర్థులు, కుటుంబాలు, ప్రము ఖులు సైతం వీటి ప్రభావంలో ఉన్నారు. ఈ నేప థ్యంలోనే డ్రగ్‌ నెట్‌ వర్క్స్‌పై నిఘా ఉంచు తున్నాం. దీనికోసం ఇతర దేశాలకు చెందిన ఏజెన్సీల తోనూ సమన్వ యం చేసుకొని పని చేస్తున్నాం. ఆయాదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌కు సంబంధించిన వివ రాలు తెలుసుకొని కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.  

అమెరికా టు అమెరికా వయా హైదరాబాద్‌ 
ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేసిన అక్కడ ఏజెన్సీలు రెండు రకాలైన డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ వల్ల ఇలా జరిగినట్టు తేల్చాయి. ఆ మాదకద్రవ్యా లను సరఫరా చేసింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి సమాచారం ఇచ్చాయి. వెంటనే అప్రమత్తమై దాడి చేసి అతడిని పట్టుకున్నాం. భారీమొత్తం నగదుతో పాటు డ్రగ్స్‌ సీజ్‌ చేశాం. ఇతడికి అవి న్యూజిలాండ్‌ నుంచి వచ్చినట్టు తేలడంతో అక్కడి ఏజెన్సీలకు తెలిపాం. వారు కొన్ని అరెస్టులు చేయగా...అసలు మూలం అమెరికాలోని న్యూయార్క్‌ అని తేలింది. దీంతో అమెరికా ఏజెన్సీలు కీలక సూత్రధారిని పట్టుకున్నాయి. డ్రగ్స్‌ నెట్‌వర్క్స్‌ కార్యకలాపాలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

సాంకేతిక పరిజ్ఞానమే పెనుసవాల్‌
⇒ డ్రగ్స్‌ మాఫియాలు ఇంటర్‌నెట్, డార్క్‌ వెబ్, క్రిప్టో కరెన్సీ వంటివి వినియోగిస్తుండటం పెద్ద సవాల్‌గా మారింది. అయినా హైదరాబాద్‌ యూనిట్‌ సమర్థంగా పనిచేస్తూ గడిచిన రెండేళ్లల్లో 24 భారీ డ్రగ్‌ నెట్‌వర్క్స్‌ను ఛేదించింది. ఈ కేసుల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎన్సీబీకి చిక్కితే బయట పడటం కష్టమనే భావన వినియోగదారులు, విక్రేతలు, సరఫరా దారులకు ఉంది. బయట నుంచి వచ్చే భారీ డ్రగ్‌ కన్‌సైన్‌మెంట్స్‌తో పాటు ఇక్కడ తయారయ్యే వాటిపై ఎక్కువ దృష్టి పెడతాం. ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్‌ దానికి అనుబంధమైన కెమికల్‌ హబ్‌గానూ మారింది. ఇవే కొన్నిసార్లు పక్కదారి పట్టి ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్, ఎంఫిథిటమీన్‌ వంటి డ్రగ్స్‌ తయారవుతున్నాయి. ఇలా తయారు చేసే రెండు ల్యాబ్స్‌పై ఇటీవల దాడులు చేశాం.

మార్పులు కనిపిస్తే జాగ్రత్త..
ప్రధానంగా 12 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. అలాంటి వారితో మాన్పించడం కూడా పెద్ద సవాలే. వీరి ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఒంటరిగా గడపటం, బాగా చదివేవారు ఒక్కసారిగా డల్‌ అయిపోవడం, ముభావంగా ఉండటం, ఐ టు ఐ కాంటాక్ట్‌ లేకుండా మాట్లాడటం చేస్తుంటే అనుమానించి అప్రమత్తం కావాలి. డ్రగ్స్‌ వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతారనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ క్రయవిక్రయాలకు సంబంధించి భారీ గ్యాంగ్స్‌ లేవు. అన్నిరంగాల్లో ఉన్నట్టే అతి తక్కువ శాతమే సినీరంగంలో డ్రగ్స్‌ ఉన్నాయి. అయితే దీనిపై అందరూ దృష్టి పెట్టడంతోనే ఎక్కువ ఎక్స్‌పోజ్‌ అవుతోంది.

డమ్మీవి పంపి పెడ్లర్స్‌ను పట్టుకున్నాం
⇒  డ్రగ్‌ పెడ్లర్స్‌ను పట్టుకోవడానికి ఎన్సీబీ అనేక రకరకాల ఆపరేషన్లు చేస్తుంది. ఇటీవల ఓ కొరియర్‌ పార్శిల్‌పై మాకు సమాచారం అందింది. దానిని అడ్డుకొని విప్పి చూడగా అందులో 110 ఎల్‌ఎస్డీ బోల్ట్స్‌ దొరికాయి. వీటిని ఎవరు ఆర్డర్‌ ఇచ్చారో వారిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దీంతో ఆ పార్శిల్‌లో డమ్మీ బోల్ట్స్‌ ఉంచి చేరాల్సిన చిరుమానాకు పంపి నిఘా ఉంచాం. దాన్ని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు పెడ్లర్స్‌ని గతవారం అరెస్టు చేశాం. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు వేరుగా ఉండవచ్చు. అయితే డ్రగ్స్‌కు మాత్రం అన్ని పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ ‘సే ఎస్‌ టు లైఫ్‌... సే నో టు డ్రగ్స్‌’ అనేది గుర్తుంచుకోవాలి. దీనిపై పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో భారీ ప్రచారం చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement