
ఇమ్రాన్ ఖాన్ - రేహమ్ ఖాన్‌లు (ఫైల్‌ఫోటో)
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, చేతబడులు వంటి వాటిని నమ్ముతాడని, అతనికి ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్‌కు చెందిన వారు కూడా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ గురించి అతని మాజీ భార్య రేహమ్ ఖాన్ రచించిన పుస్తకం గురువారం విడుదలయ్యింది.
ఈ పుస్తకంలో ఆమె వారి పది నెలల వైవాహికి జీవితానికి సంబంధించిన అంశాలనే కాక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ, వ్యక్తిగత అంశాలను తెలియజేసారు. కొన్నాళ్లుగా ఈ బుక్‌లోని కీలక అంశాలను లీక్ చేస్తూ వచ్చిన ఆమె.. మొత్తానికి ఇవాళ బుక్ రిలీజ్ చేసింది. ఇందులో ఇమ్రాన్ గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది.
గురువారం విడుదలైన ఈ పుస్తకంలో ఇమ్రాన్‌కు భారత ప్రధాని మోదీలాగా ప్రధాన మంత్రి కావాలనే కోరిక ఉందని తెలియజేసారు. అంతేకాక ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్కం కూడా చేసేవారని వెల్లడించింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో ఇమ్రాన్‌కు శారీరక సంబంధం ఉందని చెప్పింది. మోబీకి అప్పటికే పెళ్లి అయినట్లు తెలిపింది.
ఇక ఇమ్రాన్‌ఖాన్‌కు చాలా మందితో అక్రమ సంతానం ఉన్నారని కూడా ఆ పుస్తకంలో రేహమ్ వెల్లడించింది. ఇమ్రాన్‌కు మొత్తం ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్‌కు చెందిన వారు కూడా ఉన్నారని ఆమె చెప్పింది. తనకు కాకుండా ఇమ్రాన్ తొలి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌కు మాత్రమే ఆయన అక్రమ సంతానం గురించి తెలుసని రేహమ్ తెలిపింది. ఇమ్రాన్‌తో సంతానం పొందిన భారత మహిళల గురించి ‘వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ చెప్పేవార’ని రేహమ్ వెల్లడించింది.
ఇమ్రాన్ ఖాన్‌కు డ్రగ్స్ తీసుకొనే అలవాటు కూడా ఉన్నట్లు ఆ పుస్తకంలో ఆయన మాజీ భార్య స్పష్టంచేసింది. ఆయన బాత్‌రూమ్‌లో కొకైన్ తీసుకుంటుండగా తాను చాలాసార్లు చూసినట్లు చెప్పింది. ఇక చేతబడుల్లాంటి వాటిని కూడా ఇమ్రాన్ నమ్ముతాడని వెల్లడించింది. తనకున్న దోషం పోవడానికి నల్లటి కందులతో ఇమ్రాన్ తన శరీరమంతా రుద్దుకోవడాన్ని తాను చూసినట్లు రేహమ్ ఆ బుక్‌లో తెలిపింది.
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పుస్తకం విడుదల కావడంతో ఇమ్రాన్‌ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment