డ్రగ్స్‌, వ్యభిచారం నేరం కాదు: సీనియర్‌ నటి | Somy Ali Defends Aryan Khan I Tried Drugs with Divya Bharti During Andolan Movie Shoot | Sakshi
Sakshi News home page

Aryan Drug's Case: దివ్యభారతితో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నా: సీనియర్‌ నటి

Published Sat, Oct 9 2021 8:04 AM | Last Updated on Sat, Oct 9 2021 9:27 AM

Somy Ali Defends Aryan Khan I Tried Drugs with Divya Bharti During Andolan Movie Shoot - Sakshi

ముంబై డ్రగ్స్‌ కేసులో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కి బాలీవుడ్‌ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, పూజా భట్‌, హృతిక్‌ రోషన్‌ సపోర్టు చేయగా.. తాజాగా మరో సీనియర్‌ నటి సోమీ అలీ సోషల్‌ మీడియాలో మద్దతు తెలిపింది.

ఆర్యన్‌ చేసింది తప్పు కాదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అందులో..‘పిల్లలు డ్రగ్స్‌ వాడడం సహజం. నాకు ఇది పెద్ద విచిత్రంగా ఏం అనిపించట్లేదు. వ్యభిచారం, డ్రగ్స్‌ వంటి వాటిని పూర్తిగా తొలగించలేం. అందుకే వాటిని క్రిమినల్‌ జాబితాలోంచి తొలగించాలి. ఇక్కడ ఎవరు సాధువులు కాదు. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్‌ తీసుకున్నాను’ అని నటి సోమీ తెలిపింది. అంతేకాకుండా ‘ఆందోళన్‌’ మూవీ తీస్తున్న సమయంలో దివ్యభారతితో కలిసి డ్రగ్స్‌ ట్రై చేసినట్లు ఈ సీనియర్‌ నటి  చెప్పింది. ఇది చెప్పడానికి ఎలాంటి గిల్ట్‌ ఫీలింగ్‌ లేదని ఆమె పేర్కొంది.

అయితే శుక్రవారం ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ని విచారించిన మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అనంతరం 3 నుంచి 5 రోజుల క్వారంటైన్‌ కోసం అతనితో పాటు కేసులో ఉన్న మరో ఏడుగురిని ఆర్థర్‌ రోడ్‌ జైలుకి తరలించాలని చెప్పింది.

చదవండి: ఆర్యన్‌ ‍ఖాన్‌ బెయిల్‌ విచారణలో లాయర్‌ వాదన సాగిందిలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement