ముంబై తీరంలో రేవ్‌ పార్టీ.. ఎన్‌సీబీ అదుపులో షారుఖ్‌ కొడుకు? | NCB busts rave party on Mumbai Coast Bollywood Superstars Son Arrested | Sakshi
Sakshi News home page

Rave Party: ముంబై తీరంలో రేవ్‌ పార్టీ.. ఎన్‌సీబీ అదుపులో షారుఖ్‌ కొడుకు?

Published Sun, Oct 3 2021 8:35 AM | Last Updated on Sun, Oct 3 2021 11:21 AM

NCB busts rave party on Mumbai Coast Bollywood Superstars Son Arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసులు నమోదు అవ్వడం తెలిసిందే. తాజాగా అటువంటిదే ముంబై తీరంలో జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కు ఓ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తన బృందంతో కలిసి సముద్రం మధ్య క్రూయిజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

అందులో షారుఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 7 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత స్టార్‌ హీరో కొడుకుతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇంతకుమందు కూడా ఇలాగే సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియాడ్స్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా అనేక ఇతర బాలీవుడ్ ప్రముఖులను ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ విచారించింది.

చదవండి: కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement