
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్యన్‌తో పాటు మొత్తం 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లతో ఆర్యన్ చాటింగ్‌పై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో షారుక్ తన కుమారుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భార్య గౌరీ ఖాన్‌తో కలిసి సిమి గేర్‌వాల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్..
'నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు. సిగరెట్ తాగొచ్చు. సెక్స్, డ్రగ్స్‌ని కూడా ఆస్వాదించొచ్చు. అన్ని రకాలుగా అతను ఎంజాయ్ చేయవచ్చు' అంటూ షారుక్ సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తను యవ్వనంలో చేయని పనులు తన కొడుకు చేయాలంటూ షారుక్ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజం అయ్యాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) చేసిన రైడ్‌లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. చదవండి: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్
Seriously Shahrukh Khan!! @narcoticsbureau
— Priya Kulkarni (@priyaakulkarni2) October 3, 2021
Today he has been arrested pic.twitter.com/1WfZkNkvSC
Comments
Please login to add a commentAdd a comment