
Shah Rukh Khan's Son Aryan Khan Arrest: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్‌ను వైద్య పరిక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) శనివారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక రేవ్ అందులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment