
ముంబై: చెడు మార్గాలు పట్టకుండా ఇకపై నిరుపేదల అభ్యున్నతి కోసం పని చేస్తానని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అన్నారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఆర్థర్‌రోడ్ జైల్లో ఉన్న ఆర్యన్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక మీరంతా గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఆర్యన్ ఎన్‌సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకు హామీ ఇచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు.
నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి కోసమే పని చేస్తానని.. చెడు మార్గాల్లో నడవనని ఆర్యన్ చెప్పినట్టుగా ఆ అధికారి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్‌సీబీ అధికారులు కలిసి ఆర్యన్, అతడి సహ నిందితులకు జైలులో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఈ నెల 20న తీర్పు వెలువరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment