డ్రగ్స్ బానిసలపై ఎయిమ్స్ సర్వే | Government, AIIMS Survey To Ascertain Number Of Drug Addicts | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ బానిసలపై ఎయిమ్స్ సర్వే

Published Mon, Jul 4 2016 7:36 PM | Last Updated on Thu, Aug 16 2018 4:07 PM

Government, AIIMS Survey To Ascertain Number Of Drug Addicts

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలపై ఆధారపడి జీవిస్తున్న వారి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు చెందిన నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్(ఎన్డీడీటీసీ) సహకారంతో సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేలో డ్రగ్స్‌పై ఆధారపడిన వారి సమాచారంతోపాటు, అవి వినియోగదారులకు ఏ విధంగా చేరవేస్తారన్న వాటిని గుర్తించనున్నారు. అయితే ఈ సర్వే నిర్వహించడానికి దాదాపు రూ.22.41 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

గత కొన్నేళ్లుగా ప్రపంచ మాదకద్రవ్యాల వార్షిక నివేదికలో భారత సమాచారం లేదు. 15 ఏళ్ల క్రితం నిర్వహించిన ఇలాంటి సర్వేలో రాష్ట్రాలవారీగా సమాచారం లేదని, మహిళల్లో ఏ మేరకు డ్రగ్స్ ప్రభావం ఉందనేదిలేదని సామాజిక న్యాయ శాఖ అధికారి తెలిపారు. ఈ సర్వే ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement