
Drug Based Cough Syrup Smuggling: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో "లీన్" "సిజర్ప్" అనే మారుపేరుతో కూడా పిలిచే కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ (సీబీఎస్) ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వైద్యుడితో సహా సుమారు ఆరుగురిని అరెస్టు చేశామని కోల్‌కతా జోన్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) తెలిపింది. అయితే ఎన్‌సీబీ కోల్‌కతా జోన్ బారక్‌పూర్‌లో నిర్వహించి దాడులలో ఈ ఘటన వెలుగు చేసింది.
(చదవండి: ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి!
అంతేకాదు ఆ నిందుతులు కోడైన్ సిరప్‌ను స్మగ్లింగ్ చేస్తున్న సిండికేట్‌లో భాగమని, పైగా మాదకద్రవ్యాల బానిసలు త్వరితగతిన అధిక ధర వెచ్చించి కొనేవాళ్లకే ఇవి ఎక్కువగా విక్రయిస్తుంటారని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. పైగా ఇరుదేశాల మధ్య సరిహద్దుగా ఉండే ముళ్ల కంచె వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన దాదాపు 2,245 డయలెక్స్ డీసీ బాటిళ్లను కూడా ఎన్‌సీబీ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ మేరకు ఆ నిందితులు వాహనాల్లో బరాక్‌పూర్ నుంచి నదియాకు సీబీఎస్‌ను రవాణా చేస్తున్నారని చెప్పారు.
ఈ కమంలో ఎన్‌సీబీ బృందం మాట్లాడుతూ..."మొదట, మేము ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నాము, ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్‌కి సంబంధించిన మెడికల్ ప్రాక్టీషనర్ రిప్రజెంటేటివ్‌ని పట్టుకున్నాం. అయితే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ సీబీఎస్ డ్రగ్‌ని నిల్వ చేయడానికి తన మెడికల్ గోడౌన్‌ను ఇచ్చాడు. పైగా ఆ గోడౌన్‌కి లైసెన్స్ లేదు. అంతేకాదు బరాక్‌పూర్‌లోని రామ్ మెడికల్ హాల్ నుంచి నగరంలోని మహిస్‌బథన్ (ధాపా) ప్రాంతంలో గుర్తింపు లేని కొన్ని సంస్థలకు నిషిద్ధ వస్తువులు సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది." అని అన్నారు.
ఈ క్రమంలో మయన్మార్‌కి సంబంధించిన యాబా ట్యాబ్లెట్లు భారత్‌లో తయారు చేయబడిన కోడైన్ ఆధారిత సిరప్‌లకు వంటి అక్రమ రవాణాలను తనిఖీ చేయడంలో ఢాకా ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ సహాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. భారత్ కొన్ని మెడిల్ మందులపై నిషేధం విధించినట్లుగా బంగ్లదేశ్ బోర్డర్ గార్డ్స్ కూడా నిషేధం విధించాలని కోరింది కానీ అవి దేశంలో ప్రసిద్ధ వైద్య నివారిణలు కావడంతో సాధ్యం కాలేదు.
(చదవండి: అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం)
Comments
Please login to add a commentAdd a comment