లాఫింగ్ గ్యాస్ గురించి వినే ఉంటారు. సై మూవీలో హీరో నితిన్ జెనీలియాని ఆటపట్టిస్తుండటంతో కోపంతో అతడిపైకి వస్తుంది. దీంతో నితిన్ ఈ గ్యాస్‌ని వదలడం జరుగుతుంది. దీంతో ఆమె తెగ నవ్వుతూనే ఉంటుంది. ఇదేంటీ కోపం రావడం లేదేంటీ నాకు నవ్వు వస్తోందంటూ కింద పడిపోతుంది. దీన్ని పీలిస్తే నవ్వు వస్తుందా? అంటే.. రాదుగాని ఉల్లాసభరితంగా అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మాదకద్రవ్యాల మాదిరి మత్తుని కలిగిస్తుంది. అలాంటి ఈ లాఫింగ్ గ్యాస్‌ని డబ్బాల కొద్ది పీల్చింది ఓ విద్యార్థి. దీంతో ఆమె..
ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఎల్లెన్ మెర్సస్ గతేడాది ఫిబ్రవరి 9న తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి హుటాహుటినా తీసుకువెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు ఆమె చనిపోవడానకి గల కారణాలను దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యులు ఆమె నైట్రస్ ఆక్సైడ్(లాఫింగ్ గ్యాస) పీల్చడం వల్లే చనిపోయిందన్నారు. దీంతో ఆమె ఆస్పత్రికి వచ్చేటప్పుడూ.. పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ చేయగా..అబులెన్స్‌లో ఉన్న మెడికల్ టెక్నీషియన్ మైకేలా కిర్ట్‌లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
తాను ఎమర్జెన్సీ అని పిలుపు రావడంతో మెర్సర్ ఇంటికి వెళ్లామని అక్కడ ఆమె బెడ్ రూంలో స్ప్రుహలోనే ఉందని, కాకపోతే గుండె స్పందనలు అసాధారణంగా ఉన్నాయన్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ కాల్ చేయడంతో తాము వచ్చామని చెప్పారు. ఆమె నైట్రస్‌ఆ క్సైడ్ పీల్చుతోందని ఆ బాటిల్స్ తనకు చూపించడాని అన్నారు. ఈ తాగే క్రమంలోనే నైట్రస్ ఆక్సైడ్ ఆమె కాళ్లపై పడటంతో గాయలయ్యాయని, దీంతో రెండు వారాల నుంచి బాత్రూంకి వెళ్లడానికి ఇబ్బందిపడి మానేసిందని చెప్పుకొచ్చినట్లు తెలిపారు.
ఇక విచారణలో మెర్సర్ బాయ్‌ఫ్రెండ్ ఆమె 600 గ్రాములు ఉండే నెట్రస్ ఆక్సైడ్‌ని రోజుకి మూడు బాటిల్స్ చొప్పున తాగేదని, ఇటీవల తగ్గించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలా నైట్రస్‌గ్యాస్‌ని వినియోగించడం చట్ట విరుద్ధం. కానీ పోలీసు ఆ వేలో కేసు నమోదు చేయపోవడం గమనార్హం. ఈ ఘటన అనంతరం యూకే ప్రభుత్వం నవంబర్ 2023లో దీని వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే గాక క్లాస్ సీ డ్రగ్‌గా వర్గీకరించింది.
దీన్ని మత్తురాయళ్లు మంచి కిక్ ఇచ్చే డ్రగ్ మాదిరిగా వాడి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారని పేర్కొంది. నిజానికి ఇది అంత ప్రమాదకరమైంది కాదు. వైద్యపరమైన విధానంలో నొప్పి తగ్గించేందుకు, దంత శస్త్ర చికిత్సలోనూ మత్తు ఇవ్వడం కోసం వాడటం జరుగుతుంది. దీన్ని అదే పనిగా పీల్చడం మొదలు పెడితే మాత్రం నాడి సంబంధ సమస్యలు ఉత్ఫన్నమయ్యి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
(చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment