మత్తుమందులకు బానిసై రోజంతో మత్తులో జోగుతుండే వ్యక్తులు గురించి విన్నాం. వారిని ఆ వ్యసనం నుంచి బయపడేసేందుకు నానాయాతన పడుతుంటారు సంబంధికులు. అందుకోసం డీ అడిక్షన్ సెంటర్‌లు కూడా వచ్చేశాయి. అయితే ఈ మత్తు మందులన్నీ వాళ్లంతటా వాళ్లు వొళ్లు తెలియకుండా ఊహ ప్రపంచంలో విహరించేందుకు వాడుతుంటారు కానీ ఈ కొత్త రకం డ్రగ్ మాత్రం ఏకంగా అవతలి వాళ్ల మైండ్‌ని కంట్రోల్ చేస్తుందట. కొందరూ దుండగలు ఈ డ్రగ్‌తో అమాయక ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతకీ ఏంటి కొత్త రకం డ్రగ్. ఎలా అవతల వాళ్ల మైండ్‌ని కంట్రోల్ చేయగలరు?
ఈ డ్రగ్ పేరు స్కోపోలమైన అనే సింథటిక్ డ్రగ్. దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. వికారం, నిలకడలేనితనం, కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాల్లోనూ దీన్ని కలుపుతారు. అయితే ఇది సహజంగా లభించేది కాదు. కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్‌ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఉమ్మెత్త పువ్వు నుంచి తయారు చేస్తారు.
ఒకప్పుడు పిచ్చొళ్లను చేసేందుకు..
ఒకప్పుడు దేశంలో, ప్రజల్నిపిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు. అందులో నుంచి కొంత భాగాన్ని తీసి దాన్ని ఉపయోగించి స్కోపోలమైన్ సింథటిక్ డ్రగ్‌గా తయారు చేస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్ గ్యాంగులు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేసినట్లు నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వెల్లడించారు.
ఎలా పని చేస్తుందంటే..
రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపోలమైన్ డ్రగ్ ఉపయోగించినట్లు ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం. ఆ సమయంలో దీన్ని ద్రవ రూపంలో ఇంజక్షన్‌గా ఇచ్చేవారు. స్కోపోలమైన్‌ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నామని బంగబంధు షేక్ ముజిబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదుర్ రహమాన్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపోలమైన్‌ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు. ఈ డ్రగ్‌ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు. ఎవరితోనైనా నిజాలు మాట్లాడించడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పౌడర్‌ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది. అలాగే దీన్ని వికారం, ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధం లాగా పని చేస్తుందని రహమాన్ వివరించారు.
నేరాలలో ఎక్కువగా
మోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్‌ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్‌ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్‌ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక. ఈ పౌడర్‌ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద, అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచి ప్రయోగించినా.. అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది.
దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు. ఇక్కడ ఈ డ్రగ్‌ని పీల్చిన పది నిముషాల నుంచి సదరు వ్యక్తి మీద ప్రభావం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది. మళ్లీ మాములు కావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది.
(చదవండి: ఓటర్లకు స్ఫూర్తి ఆ వృద్ధ మహిళలు..! ఆ ఏజ్‌లోనూ..)
Comments
Please login to add a commentAdd a comment