![Akshay Kumar comments On Drugs Controversy - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/5/Akshay-Kumar.jpg.webp?itok=GDA_vp1r)
‘‘కొన్ని రోజులుగా ఓ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీ వల్ల ఏం మాట్లాడాలో ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్‌లో డ్రగ్స్ కాంట్రవర్శీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం గురించి అక్షయ్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘‘మమ్మల్ని స్టార్స్‌ని చేసింది ప్రేక్షకులే. సినిమాల ద్వారా మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని మేం ప్రచారం చేస్తుంటాం. సుశాంత్ మరణం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. మన ఇండస్ట్రీలో ఉన్న తప్పొప్పుల్ని సమీక్షించుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ ఉన్నాయి. కానీ అందరూ తీసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరినీ దోషులుగా చూడొద్దు. ఇది కరెక్ట్ కాదు’’ అని అన్నారు అక్షయ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment