రంగారెడ్డి: హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్సింగిలో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్‌తో ఓ యువతి.. మరో వ్యక్తి పట్టుబడ్డారు. వాళ్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువహీరో ప్రేయసిగా తేలింది.
ఎస్ఓటీ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగీలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్‌వోటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతియువకుడి దగ్గరనుంచి 4 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో ప్రేయసి గుర్తించారు.
షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు దక్కించుకుని వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నాడు ఆ యువ హీరో. మొన్న సంక్రాంతికి ఓ అగ్రహీరో చిత్రంలోనూ ఆ హీరో చిత్రంలోనూ ఆ యంగ్ హీరో నటించాడని పోలీసులు చెబుతున్నారు.
రిమాండ్ విధింపు
సదరు యువతి మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment