సాక్షి, హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డి తనను మోసం చేశాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డికి తనకు ఏడాది క్రితం వివాహం అయిందని, తాజాగా ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆమె తెలిపారు. క్రమంగా తనపై ఇష్టాన్ని పెంచుకున్న మహేష్.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పినట్లు వెల్లడించారు.ఘీ
ఈ క్రమంలో వివాహం చేసుకున్నామని, ఏడాది నుంచి ఒకే దగ్గర ఉంటున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎస్‌గా సెలెక్ట్ అయిన తర్వాత మహేష్‌లో చాలా మార్పు వచ్చిందని, అదనపు కట్నం తీసుకుని వస్తేనే కాపురం చేస్తానని చెప్పినట్లుగా ఆమె తెలిపింది. పోలీసులు తన కుటుంబానికి రక్షణ కల్పించి.. తనకు న్యాయం చేయాలని భావన కోరింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మహేష్ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జవహెర్ నగర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment