
షార్ ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
శ్రీహరికోట : నేషనల్ పోలీస్ ఆకాడమీ హైదరాబాద్‌కు చెందిన 16 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారుల బృందం శుక్రవారం సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)ను సందర్శించారు. ఇన్‌ఛార్జి సీఐ రత్తయ్య, ఎస్సైలు జీ గంగాధరరావు, విజయకుమార్‌లు వారికి స్వాగతం పలికి షార్ లోపలకు తీసుకెళ్లారు.
భాస్కర్ అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసి షార్ ఇంజినీర్లు శ్రీహరికోట రేంజ్ గురించి క్షుణ్ణంగా వివరించారు. ఆ తరువాత షార్ సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం షార్ ఇంజినీర్లు 16 మంది అధికారుల బృందాన్ని రెండోగేట్ తరువాత వున్న మిషన్ కంట్రోల్‌సెంటర్, రెండు ఫ్రయోగవేదికలు, ఇక్కడ జరిగే రాకెట్ ప్రయోగాల గురించి తెలుసుకున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలు, సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం శిక్షణలో భాగమని బృందం నాయకుడు అన్నారు.