
కోల్‌కతా: మణిపూర్ తరహా ఘటన పశ్చిమ బెంగాల్‌లోనూ జరిగిందని హుగ్లీ భాజపా ఎంపీ లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. మణిపుర్ ఘటపై మాట్లాడుతూ మీడియా సమావేశంలో స్పందించారు. జులై 8న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన జరిగిందని అన్నారు. భాజపా మహిళా అభ్యర్థిని వివస్త్రని చేసి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. ఇదో మణిపూర్ లాంటి ఘటనే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్ ఘటనను ఖండిస్తున్నామని తెలిపిన పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్.. పశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో భాగమేనని అన్నారు. బెంగాల్‌లో మహిళకు జరిగిన ఘటన కూడా అమానవీయం అని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారని చెప్పారు.
హౌరా జిల్లాలోని దక్షిణ్ పంచాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపిన సుకాంత మజుందార్.. దీనిపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Manipur Violence: 'కార్గిల్‌లో పోరాడినా.. భార్యను కాపాడలేకపోయా' మణిపూర్ బాధితుని ఆవేదన