కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నటి, టీఎంసీ నేత మిమీ చక్రవర్తి తన లోక్‌సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు. అయితే ఆమె సీఎం ఆమోదించలేదు. ప్రొటోకాల్ ప్రకారం లోక్‌సభ ఎంపీ రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి. ఇంకా లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాను అందజేయ్యకపోవడంతో ఇది అధికారిక రాజీనామాగా పరిగణించకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment