స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అనంతపురం నగరంలో 2,800 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జెండాను జిల్లాలోని రొద్దం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ గుప్తా రూపొందించారు. జెండా ప్రదర్శనను స్థానిక టవర్‌క్లాక్ వద్ద డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు ప్రారంభించారు.