రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలులో రెడ్‌షర్ట్ వలంటీర్లు కవాతు నిర్వహించారు. ఎర్రెర్రని చొక్కాలు, ఖాకీ ప్యాంటులు ధరించిన వలంటీర్లు ఎర్రజెండాలు చేతబూని విజయనాదం పూరించారు. బళ్లారిచౌరస్తా సమీపంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈ పుల్లయ్య జెండా ఊపి కవాతును ప్రారంభించగా కొత్తబస్టాండ్, పుచ్చలపల్లి సుందరయ్య సర్కిల్, శ్రీరామథియేటర్, ఆర్‌కే కలర్ ల్యాబ్, రాజ్‌విహార్, జిల్లా పరిషత్, పెద్దపార్కు మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరక కవాతు కొనసాగింది. కార్యక్రమంలో నాయకులు టి.రాముడు, జి.సుబ్బయ్య, ఎండీ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.