చరిత్రలోనే భారీ విషాదాంతంగా మిగిలిన జోన్స్‌టౌన్ నరమేధం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే. ఒకేసారి 900 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవటం.. సామూహిక ఆత్మహత్యల ఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. వెనిజులా-సురీనామ్ మధ్య ఉన్న తీరప్రాంతం గుయానాలోని జోన్స్‌టౌన్‌లో నాలుగు దశాబ్దాల క్రితం ఇది చోటుచేసుకుంది.
అమెరికా మతగురువు, పీపుల్స్ టెంపుల్ వ్యవస్థాపకుడు జిమ్ జోన్స్‌ను వేలాది మంది అనుచరులు గుడ్డిగా నమ్మేవారు. నవంబర్ 19, 1978న భారీ సంఖ్యలో అనుచర గణాన్ని ఒక్కచోట చేర్చారు. వారందరు విషపు పానీయాన్ని స్వీకరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఐదొంతుల మంది చిన్నారులు ఉండటం గమనార్హం. వారికి సిరంజీల ద్వారా వారి వారి తల్లిదండ్రులు విషం ఎక్కించారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తర్వాత దర్యాప్తులో వెల్లడించింది. ఘటన తర్వాత జిమ్ జోన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కారణం.. జోన్స్‌టౌన్‌లో పరిస్థితులు బాగా లేవని, పూర్తిగా అక్రమాలు సాగుతున్నాయని అమెరికాకు నివేదిక అందింది. దీంతో లియో ర్యాన్‌ను తమ ప్రతినిధిగా అమెరికా జోన్స్‌టౌన్‌కు పంపింది. అయితే పీపుల్స్ టెంపుల్ ముసుగులో అరాచకాలు జరుగుతున్నాయన్న నివేదిక లియోర్యాన్‌కు చేరటంతో.. జోన్స్‌టౌన్‌పై వైమానిక దాడులకు ఆదేశించాడు. అప్పటికే పీపుల్స్ టెంపుల్ సభ్యులు కొందరినీ అమెరికా సైన్యం కాల్చి చంపింది. దీంతో కలత చెందిన జిమ్స్ జోన్స్ పెద్ద ఎత్తున్న అనుచరులను సమీకరించి.. ఈ నరమేధానికి కారకుడయ్యాడు. అయితే ఆ ఘటన నుంచి తప్పించుకున్న కొందరు జోన్స్‌టౌన్ ప్రజలు మాత్రం.. ఈ ఘటనను అతిపెద్ద హత్యాపర్వంగా అభివర్ణిస్తుంటారు.
ఢిల్లీ బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఈ కథనం ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment