
కాంగోలో ఘర్షణలు.. 31 మంది మృతి
కిన్షాసా: మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో భద్రతాబలగాలు, ట్రైబల్ తిరుగుబాటు దారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 31 మంది మృతి చెందారు. సెంట్రల్ షికాపా రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కసాయ్ ప్రావిన్స్ గవర్నర్ వెల్లడించారు.
షికాపా ప్రాంతంలోకి వెళ్లిన భద్రతా బలగాలు, పోలీసులపై స్థానిక తెగ తిరుగుబాటుదారులు దాడి చేసి ఆయుధాలను లాక్కొని హతమార్చారు. అనంతరం అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కూడా వారు దాడికి పాల్పడటంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల పరస్పర కాల్పుల్లో 13 మంది భద్రతా సిబ్బంది, 18 మంది తిరుగుబాటు దారులు మృతి చెందారు. మరో 13 మంది భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.