కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment