కాంగోలోని ఒక గ్రామంలో సాయుధ దుండగులు జరిపిన హింసాకాండలో తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. కాంగో రాజధాని మిలీషియాకు సమీపంలో జరిగిన ఈ హింసాయుత దాడిలో 72 మంది మృతి చెందారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.
కాంగోలో ఇటీవలి కాలంలో ప్రత్యర్థి వర్గాల మధ్య హింస తీవ్రమైంది. రాజధాని కిన్షాసాకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్సాలే గ్రామంలో ఈ హింసాయుత ఘటన చోటుచేసుకుంది. కిన్సాలే క్వేమౌత్ ప్రాంతంలో టెకే- యాకా కమ్యూనిటీల మధ్య రెండేళ్లుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా వందలాది మంది పౌరులు బలి అవుతున్నారు. దాడికి పాల్పడుతున్న వారు మొబోండో మిలీషియా సభ్యులని తెలుస్తోంది. వీరు యాకా వర్గంలోని ప్రజలను రక్షించేవారిగా పేరొందారు.
క్వామౌత్ ఏరియా ప్రావిన్షియల్ అధికారి డేవిడ్ బిసాకా మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిలీషియాను తరిమికొట్టడంలో సైన్యం విజయవంతమైందన్నారు. 2024 ఏప్రిల్‌లో కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి సమక్షంలో కాల్పుల విరమణపై ఒప్పందం జరిగినప్పటికీ, ఈ గ్రూపుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో అవి తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని తూర్పు ప్రాంతంలో చెలరేగుతున్న హింసను నిరోధించడానికి కాంగో సైన్యం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని బంగారం ఇతర వనరులలో వాటా కోసం ఇరు వర్గాలు పరస్పరం పోరాటం సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment