కడలిపై.. హాయి హాయిగా.. | Construction Of Cruise Terminal At Visakhapatnam | Sakshi
Sakshi News home page

కడలిపై.. హాయి హాయిగా..

Published Fri, Oct 30 2020 10:30 AM | Last Updated on Fri, Oct 30 2020 10:30 AM

Construction Of Cruise Terminal At Visakhapatnam - Sakshi

క్రూయిజ్‌ టెర్మినల్‌‌ నమూనా

విశాఖ నగర సిగలో మరో పర్యాటక మణిహారం చేరనుంది. విదేశీ పర్యాటకులు వాహ్‌వా అనేలా.. స్వదేశీయులకు విదేశీ విహారం కల్పించే అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ముందడుగు పడింది. విశాఖ పోర్టు ట్రస్ట్, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్మించే ఈ టెర్మినల్‌ వచ్చే ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది. పోర్టులోని జనరల్‌ కార్గో టెర్మినల్‌ పక్కనే 10 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర విహార కేంద్రం సిద్ధమవనుంది. 

సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి మేజర్‌ పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రధాన పోర్టుల్లో క్రూయిజ్‌ టెరి్మనల్‌కు సంబంధించిన ప్రాజెక్టు పట్టాలెక్కింది. విశాఖలో గతేడాది క్రూయిజ్‌ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ నగరం.. మరింత ఆకర్షణీయంగా మారేందుకు క్రూయిజ్‌ టెరి్మనల్‌ దోహదపడనుంది. అంతర్జాతీయ పర్యాటకులు పెరగాలంటే విహారనౌకల రాకపోకలు జరగాల్సిందే. దేశంలో ఇప్పటికే ముంబయి, కొచ్చి, చెన్నై, మంగుళూరు పోర్టుల్లో క్రూయిజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటయ్యాయి. అక్కడ నుంచి నౌకలు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ టూరిజం బాగా వృద్ధి చెందింది. విశాఖలోనే అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అడుగులు వేసింది. 

రూ.77కోట్లతో నిర్మాణం  
తూర్పు తీరంలో ఎక్కడా క్రూయిజ్‌ టెరి్మనల్స్‌ లేవు. కోస్తా తీరంలో కీలక పర్యాటక స్థావరమైన విశాఖలో ఏర్పాటైతే పర్యాటకం పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఎంట్రన్స్‌ చానెల్, కంటైనర్‌ టెరి్మనల్‌ మధ్యలోని జనరల్‌ బెర్త్‌ పక్కనే ఈ టెరి్మనల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.77 కోట్లు ఖర్చవుతుందని నిర్ధారించారు. ఇందులో 50 శాతం నిధులను కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ, మరో 50 శాతం టూరిజం శాఖ కేటాయించనుంది. దీనికి సంబంధించి ఎని్వరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ ఎసెస్‌మెంట్‌(ఈఐఏ)కూడా పూర్తయ్యాయి. 

2021 నాటికి అందుబాటులోకి వస్తుంది 
అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మరికొద్ది నెలల్లో దీనికి సంబంధించిన పరిపాలన భవనాన్ని సిద్ధం చేస్తాం. 2021 చివరికల్లా అంతర్జాతీయ క్రూయిజ్‌ టెరి్మనల్‌ అందుబాటులోకి రానుంది. దీని వల్ల విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఏపీ తీరంలో ఎక్కడా ఈ తరహా టెరి్మనల్స్‌ లేవు. విశాఖ ప్రజలకు సముద్రయానం అందుబాటులోకి రానుంది. 
– కె.రామ్మోహన్‌రావు, విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ 

180 మీటర్ల పొడవైన బెర్త్‌ 
అంతర్జాతీయ పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి.. నగరంలో పర్యటించే వి«ధంగా వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. టెరి్మనల్‌ నిర్మాణంలో అనేక సౌకర్యాలు కలి్పంచనున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరగనుంది. 180 మీటర్ల పొడవైన క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మించనున్నారు. ఈ విశాలమైన బెర్త్‌ను రెండు విధాలుగా వినియోగించుకోనున్నారు. క్రూయిజ్‌ రాని సమయంలో సరకు రవాణా చేసే కార్గో నౌకలను కూడా బెర్త్‌పైకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రూయిజ్‌లో వచ్చే ఇంటర్నేషనల్‌ టూరిస్టుల చెకింగ్‌ కోసం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్‌ను నిర్మిస్తున్నారు. దీనికి తోడుగా పరిపాలన భవనం, కరెన్సీ మారి్పడి కౌంటర్లు, విశ్రాంతి గదులు, టూరిజం ఆపరేటర్స్‌ కౌంటర్లు కూడా నిర్మాణం కానున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement