ఏడాదికి పైగా ఆ జంటే నీటిపైనే జీవనం సాగించారు. ఆమె వంటగదిలోకి అడుగుపెట్టడం, వాషింగ్ మెషిన్ వినియోగించటం వంటివి చేయలేదట. పైగా అన్ని రోజులు నీటిపైనే ఎలా జీవించారు. ఎందుకంటే..
మోనికా బ్రజోస్కో, ఆమె భర్త జోరెల్ కాన్లీ ప్రత్యకమైన జీవనశైలిని ప్రారంభించారు. టేనస్సీలోని మెంఫిస్‌కు చెందిన ఈ జంట వారు ఆస్తులను విక్రమయించి మరీ క్రూయిజ్ షిప్‌ల్లోనే పయనిస్తున్నారు. వారికి కొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే మహా సరదా. అందుకోసం అని 9 టు 5 ఉద్యోగాలను కూడా వదిలేశారు. పైగా వారి ఇంటిని కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో కొత్త కొత్త ప్రదేశాలను చుట్టోస్తున్నారు.
ఇలా ఏడాదికిపైగా షిప్‌ల్లోనే ప్రయాణాలు చేశారు ఈ జంట. పైగా మోనికా తాను వంటగదిలోకి అడుగుపెట్టి ఏడాదికి పైగా అయ్యిందని చెబుతోంది. ఆఖరికి వాషింగ మెషిన్ వినియోగించ లేదంటోంది. ఆ షిప్ సిబ్బందే తమ అవసరాలన్నీ చూసుకునేవారని చెప్పింది. అలాగే ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేందుకు చక్కటి ఆర్థిక ప్రణాళికతో సాగుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 8 లక్షలకు మించకుండా ఖర్చులు చూసుకుంటూ చక్కెర్లు కొడుతోంది ఈ జంట.
తాము ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేలా చక్కటి ఆఫర్లను ఉపయోగించుక్నుట్లు తెలిపింది. అలాగే భూమిపై జీవితాన్ని విడిచిపెట్టడాన్ని విముక్తిగా అభివర్ణించారు. అంతేగాదు మాకు రోజులన్నీ విశ్రాంతిగా అన్యప్రదేశాలను అన్వేషించడంతో బిజీగా ఉన్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఈ నీటిపై జీవనం ప్రతిక్షణం ఓ మాయజాలంలా అద్భుతంగా ఉంటుందని అంటోంది ఆ జంట. అలాగే ప్రపంచ అన్వేషణ గురించి సాగుతున్న తమ కల కూడా నిజం అవుతోందని ఆనందంగా చెబుతోంది ఆ జంట.
(చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!)
Comments
Please login to add a commentAdd a comment