full time
-
ఏడాదికిపైగా ఆ జంట నీటిపైనే జీవనం! ఎందుకో తెలుసా
ఏడాదికి పైగా ఆ జంటే నీటిపైనే జీవనం సాగించారు. ఆమె వంటగదిలోకి అడుగుపెట్టడం, వాషింగ్ మెషిన్ వినియోగించటం వంటివి చేయలేదట. పైగా అన్ని రోజులు నీటిపైనే ఎలా జీవించారు. ఎందుకంటే.. మోనికా బ్రజోస్కో, ఆమె భర్త జోరెల్ కాన్లీ ప్రత్యకమైన జీవనశైలిని ప్రారంభించారు. టేనస్సీలోని మెంఫిస్‌కు చెందిన ఈ జంట వారు ఆస్తులను విక్రమయించి మరీ క్రూయిజ్ షిప్ల్లోనే పయనిస్తున్నారు. వారికి కొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే మహా సరదా. అందుకోసం అని 9 టు 5 ఉద్యోగాలను కూడా వదిలేశారు. పైగా వారి ఇంటిని కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో కొత్త కొత్త ప్రదేశాలను చుట్టోస్తున్నారు. ఇలా ఏడాదికిపైగా షిప్ల్లోనే ప్రయాణాలు చేశారు ఈ జంట. పైగా మోనికా తాను వంటగదిలోకి అడుగుపెట్టి ఏడాదికి పైగా అయ్యిందని చెబుతోంది. ఆఖరికి వాషింగ మెషిన్ వినియోగించ లేదంటోంది. ఆ షిప్ సిబ్బందే తమ అవసరాలన్నీ చూసుకునేవారని చెప్పింది. అలాగే ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేందుకు చక్కటి ఆర్థిక ప్రణాళికతో సాగుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 8 లక్షలకు మించకుండా ఖర్చులు చూసుకుంటూ చక్కెర్లు కొడుతోంది ఈ జంట. తాము ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేలా చక్కటి ఆఫర్లను ఉపయోగించుక్నుట్లు తెలిపింది. అలాగే భూమిపై జీవితాన్ని విడిచిపెట్టడాన్ని విముక్తిగా అభివర్ణించారు. అంతేగాదు మాకు రోజులన్నీ విశ్రాంతిగా అన్యప్రదేశాలను అన్వేషించడంతో బిజీగా ఉన్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఈ నీటిపై జీవనం ప్రతిక్షణం ఓ మాయజాలంలా అద్భుతంగా ఉంటుందని అంటోంది ఆ జంట. అలాగే ప్రపంచ అన్వేషణ గురించి సాగుతున్న తమ కల కూడా నిజం అవుతోందని ఆనందంగా చెబుతోంది ఆ జంట. (చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
PRS Legislative Research: నిర్ణీత సమయానికి మించి పనిచేసిన పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో లోక్‌సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్‌సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. స్పెషల్ సెషన్లో లోక్‌సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్‌సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది. -
ఇన్చార్జ్ డీఈఓకే పూర్తి బాధ్యతలు?
– నేడు అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం కర్నూలు సిటీ: ఇన్చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానాకే పూర్తి బాధ్యతలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా.. 11 చోట్ల ఇన్చార్జ్ డీఈఓలు పనిచేస్తున్నారు. శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండడంతో రెగ్యులర్ డీఈఓలు వచ్చేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇన్‌చార్జీలకే పూర్తి బాధ్యతలు ఇవ్వనున్నారు. -
ఇంటి నుంచి పని చేయాలనుకుంటే..ఇవే బెస్ట్
న్యూయార్క్: ఉద్యోగం కారణంగా ఆఫీసులోనే సమయమంతా గడిచిపోతోందనే ఎక్కువమంది ఉద్యోగస్థుల్లో సాధారణంగా ఉండే భావన. కుటుంబంతో గడపడానికి సమయం సరిపోవడం లేదు. టైమ్ అంతా ఆఫీస్‌లోనే గడిచిపోతోంది అనేది ఉద్యోగులు తరచు అనే మాటలే. అయితే దీన్ని పసిగట్టిన చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేసుకునే(వర్క్ ఫ్రమ్ హోమ్) వెసులు బాటును కల్పిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు కల్పించే ఫ్లెక్స్ జాబ్స్ సంస్థ తన పరిథిలో ఉన్నటువంటి 40,000 కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్న ఉత్తమ 100 సంస్థల జాబితాను వెల్లడించింది. ఇందులో యునైటెడ్ హెల్త్ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరితే రోజూ ఆఫీసుకు వెళ్లకుండానే మీ ఉద్యోగ జీవితాన్ని ఉత్తమంగా నిర్వహించొచ్చని ఫ్లెక్స్ జాబ్స్ తెలిపింది. ఐటీ, హెల్త్, సేల్స్, విద్య, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థల జాబితాలో అగ్రస్థానంలో టెలికమ్యుటింగ్ సంస్థలే నిలిచాయి. టాప్ 10లో నిలిచిన సంస్థలు ఇవే... 1. యునైటెడ్ హెల్త్ గ్రూప్ 2. డెల్ 3. ఐబీఎమ్ 4. హ్యుమనా 5. ఎత్నా 6. కెల్లీ సర్వీసెస్ 7. సేల్స్ ఫోర్స్ 8. పారెక్సల్ 9. సైబర్ కోడర్స్ 10. వీఎమ్‌వేర్ -
అంగన్వాడీలు..ఇక ఫుల్‌టైమ్
దోమ, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సైతం పెంచారు. కేంద్రం నుంచి వచ్చే 75శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25శాతం నిధులతో నడుస్తున్న ఈ కేంద్రాలు ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. పని వేళల్లో మార్పు చేసిన కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను కూడా స్వల్పంగా పెంచారు. ఇప్పటివరకు కార్యకర్తలకు ఇస్తున్న రూ.3,700 వేతనాన్ని రూ4,200కు, ఆయాల ఇస్తున్న రూ.1,950 వేతనాన్ని రూ.2,200కు పెంచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,500 వరకు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. పరిగి ప్రాజెక్టు పరిధిలో ఉన్న దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరు మండలాల్లో మొత్తం 230 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలను ప్రారంభించారు. అదనపు పనులు అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసిన ప్రభుత్వం ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు చేపడుతున్న పనులు, అందిస్తున్న సేవలలోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడం, పౌష్టికాహారం సరఫరా చేయడం, బాలింతలు, గర్భిణులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం, జనన, మరణాల సంఖ్యను నమోదు చేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ఏఎన్ఎంలతో కలిసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, కుటుంబ వివరాల సేకరణ వంటి పనులు చేసేవారు. ఇకపై వారు సామాజిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆయా గ్రామాల్లో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసే బాధ్యతను కూడా అంగన్వాడీ సిబ్బందికి అప్పగించింది. అంగ న్వాడీల ద్వారా ఇస్తున్న పౌష్టికాహార పంపిణీలోనూ కొంత మార్పు చేశారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఇప్పటివరకు వారానికి రెండు గుడ్లు ఇచ్చే వారు. ఇకపై వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. అంగన్వాడీల ఆగ్రహం పని వేళలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నామమాత్రంగా వేతనాలు పెంచిన ప్రభుత్వం తమతో వెట్టి చేయించుకోవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయమని తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో అంగన్వాడీలు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆదేశాలు జారీ చేశాం అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు కొనసాగించాలని ప్రభుత్వం ఇటీవలే జీఓ నెం.24 జారీ చేసింది. మారిన పనివేళలకు అనుగుణంగా కొనసాగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అయితే పలు కారణాలతో సిబ్బంది 4గంటల వరకు పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. - రాణి, అంగన్వాడీ సూపర్వైజర్, కుల్కచర్ల మండలం