ఇన్‌చార్జ్ డీఈఓకే పూర్తి బాధ్యతలు?
Published Sat, Feb 11 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
– నేడు అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం
కర్నూలు సిటీ: ఇన్‌చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానాకే పూర్తి బాధ్యతలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా.. 11 చోట్ల ఇన్‌చార్జ్ డీఈఓలు పనిచేస్తున్నారు. శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండడంతో రెగ్యులర్ డీఈఓలు వచ్చేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇన్‌చార్జీలకే పూర్తి బాధ్యతలు ఇవ్వనున్నారు.
Advertisement
Advertisement