ఇంటి నుంచి పని చేయాలనుకుంటే..ఇవే బెస్ట్
న్యూయార్క్: ఉద్యోగం కారణంగా ఆఫీసులోనే సమయమంతా గడిచిపోతోందనే ఎక్కువమంది ఉద్యోగస్థుల్లో సాధారణంగా ఉండే భావన. కుటుంబంతో గడపడానికి సమయం సరిపోవడం లేదు. టైమ్ అంతా ఆఫీస్లోనే గడిచిపోతోంది అనేది ఉద్యోగులు తరచు అనే మాటలే. అయితే దీన్ని పసిగట్టిన చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేసుకునే(వర్క్ ఫ్రమ్ హోమ్) వెసులు బాటును కల్పిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు కల్పించే ఫ్లెక్స్ జాబ్స్ సంస్థ తన పరిథిలో ఉన్నటువంటి 40,000 కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్న ఉత్తమ 100 సంస్థల జాబితాను వెల్లడించింది. ఇందులో యునైటెడ్ హెల్త్ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరితే రోజూ ఆఫీసుకు వెళ్లకుండానే మీ ఉద్యోగ జీవితాన్ని ఉత్తమంగా నిర్వహించొచ్చని ఫ్లెక్స్ జాబ్స్ తెలిపింది. ఐటీ, హెల్త్, సేల్స్, విద్య, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వివిధ సంస్థల జాబితాలో అగ్రస్థానంలో టెలికమ్యుటింగ్ సంస్థలే నిలిచాయి.
టాప్ 10లో నిలిచిన సంస్థలు ఇవే...
1. యునైటెడ్ హెల్త్ గ్రూప్
2. డెల్
3. ఐబీఎమ్
4. హ్యుమనా
5. ఎత్నా
6. కెల్లీ సర్వీసెస్
7. సేల్స్ ఫోర్స్
8. పారెక్సల్
9. సైబర్ కోడర్స్
10. వీఎమ్వేర్