కరోనా భూతం అధికంగా విజృంభించిన సమయంలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానం అమలులోకి వచ్చింది. అయితే మహమ్మారి దాదాపు అంతరించిపోయినప్పటికీ.. ఈ రోజుకి కూడా చాలా మంది ఇంటి నుంచి పనిచేయదానికి అలవాటు పడి ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ కంపనీ గట్టి వార్ణింగ్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెటా కంపెనీ ఉద్యోగులు తప్పకుండా ఆఫీసులకు రావాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నియమం ఉల్లంగిస్తే ఉద్యోగం వదిలి ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా స్పష్టం చేసింది. వచ్చే నెల 05 నుంచి (సెప్టెంబర్ 05) వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందే అంటూ ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.
సెప్టెంబర్ 5 నుంచి ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నారా? లేదా? తనిఖీ చేయాలని సంస్థ మేనేజర్లను సూచించింది. ఆఫీస్‌లో సమయం గడపడం వల్ల మెరుగైన పనితీరును సాధించవచ్చని జుకర్‌బర్గ్ గతంలో సూచించారు. అంతే కాకుండా ఉద్యోగుల మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, టీమ్ వర్క్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత..
ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికాయి. కావున ఉద్యోగులందరూ తప్పకుండా ఆఫీసులకు రావాలని.. అక్కడ నుంచే వర్క్ చేయాలనీ వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది ఆఫీసుల బాట పట్టారు. ఇక త్వరలో మెటా ఉద్యోగులు కూడా ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే అంటూ స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment