
వెబ్‌డెస్క్ : వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంపై ఎంతో దృష్టి పెడతారు. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే.
న్యూ బిజినెస్
అయితే కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్‌తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్ వెడ్డింగ్‌కి డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం అక్కడక్కడ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment