
గువహటి : పౌరసత్వ(సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉదృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను నిషేదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రులు, మంత్రులు నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో కూడా నల్ల జండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఈ క్రమంలో అస్సాంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
వివరాలు.. రెండు రోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనొవాల్, బిస్వాంత్ జిల్లాలో ర్యాలీని నిర్వహించారు. ఓ మహిళ, మూడేళ్ల తన చిన్నారితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. కారణం అడగ్గా.. మీ చిన్నారి నల్ల స్వెటర్ వేసుకుంది. దాన్ని విప్పేస్తేనే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. అంతేకాక స్వయంగా వారే ఆ చిన్నారి స్వెటర్‌ను తొలగించారు. ఈ చర్యకు భయపడిన చిన్నారి ఏడవడం ప్రారంభించింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించిన భద్రతా సిబ్బంది తీరును తప్పుపడుతున్నారు నెటిజన్లు. నల్ల రంగును చూస్తేనే పోలీసులు, అధికారులు ఒణికిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. విమర్శలు ఎక్కువ కావడంతో సీఎం విచారణకు ఆదేశించారు.
Assam CM Sarbananda Sonowal directs State DGP Kula Saikia to probe incident where a toddler was reportedly forced to open his black sweater at a function attended by the CM at Borgang in Biswanath today amid the spectre of black flag protests. pic.twitter.com/KtwmPCF8Fw
— Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) January 29, 2019
Comments
Please login to add a commentAdd a comment