అక్షయ్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపిన అస్సాం సీఎం | Assam CM Say Thanks to Akshay Kumar For Donating 1 Crore Rupees to Flood Relief | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపిన అస్సాం సీఎం

Published Tue, Aug 18 2020 3:22 PM | Last Updated on Tue, Aug 18 2020 3:22 PM

Assam CM Say Thanks to Akshay Kumar For Donating 1 Crore Rupees to Flood Relief - Sakshi

దిస్‌పూర్‌: అక్షయ్‌ కుమార్‌ ఆయన సినిమాలలోనే కాదు బయట కూడా కరోనా కాలంలో రూ. 25కోట్లు దానం​ చేసి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. మరోసారి వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాంకు కోటి రూపాయల విరాళం ప్రకటించి ఆదుకున్నాడు. ఇందుకు గాను అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్‌ ట్విటర్‌ వేదికగా అక్షయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ధ్యాంక్యూ అక్షయ్‌ జీ. అస్సాం వరదల బాధితుల కోసం రూ. కోటి రూపాయలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడూ అండగా నిలుస్తారు.  అస్సాంకు మంచి స్నేహితుడైన మీకు ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వాలు ఉండాలి. మీ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లాలి అని ట్వీట్‌ చేశారు. గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాల కారణంగా అ‍స్సాంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

చదవండి: అస్సాంలో వ‌ర‌ద‌లు..104 మంది మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement