రెజ్లర్ సుశీల్ కుమార్ శుక్రవారం కేంద్ర కీడ్రాశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్కు లేఖ రాశాడు. రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించాలంటూ అతడు తన లేఖలో పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ : రెజ్లర్ సుశీల్ కుమార్ శుక్రవారం కేంద్ర కీడ్రాశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్కు లేఖ రాశాడు. రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించాలంటూ అతడు తన లేఖలో పేర్కొన్నాడు. కాగా రియో ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సింగ్‌ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు.
అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది. కాగా రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. మరోవైపు ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోమని క్రీడా శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో సుశీల్ కుమార్ రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ లేఖపై మంత్రిత్వ శాఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.