సాక్షి, అమరావతి : ఆక్వా(చేపల పెంపకం) రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్వా రైతులను ఆదుకోవడానికి సీఎం జగన్ అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఆక్వా పంటకు సంబంధించిన ఉత్పత్తులు, ధరలపై కరోనా ప్రభావం పడకుండా ప్రభుత్వం సూచించన విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. (కరోనా కట్టడికి అన్నిజాగ్రత్తలు తీసుకున్నాం)
కాగా రైతులు చేపలకు ఎదైనా వైరస్ కానీ ఇతరత్రా ఇబ్బందులు లేకపోతే తొందరపడి తమ పంటను హార్వెస్ట్ చేయోద్దని ఆయన రైతులను కోరారు. ఆక్వా రంగానికి సంబంధించిన అసోసియేషన్, సంబంధిత అధికారులతో కలిసి రేపు ఉన్నత స్థాయితో సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆక్వా రంగానికి సంబంధించిన సారాంశాన్ని సీఎం జగన్‌తో చర్చిస్తామన్నారు. ఆ తర్వాత దీనిపై సీఎం జగన్ ఇచ్చే తదుపరి ఆదేశాల ప్రకారమే సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment