సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున చేప పిల్లలను ఇప్పుడు పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ రీజనల్ సబ్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మంచి నీటి చేపలు, రోయ్యల ఎగుమతిపై దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్ నగరంలో చేపలకు, సముద్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో 150 డివిజన్లలో లైవ్ ఫీష్ ఔట్లేట్లు పెట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు లాభాం చేకూరే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి బాగా వస్తుందని, మార్కెట్లు బాగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 1:15 రేషియోలో చేపలకు లాభం ఉంటుందని, రాబోయో రోజుల్లో ప్రభుత్వమే మార్కెటింగ్‌కు సహకారం అందిస్తుందని చెప్పారు.
కేంద్ర సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి వసతులు బాగా పెరిగాయని, రిజర్వాయర్లు చెరువులు, కాలువలు నీటి వసతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తులకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మెరైన్ ఉత్పత్తుల కంటైన్ లాండ్ ఫిష్‌ల ఉత్పత్తులపై దృష్టి సారించామపి చెప్పారు. తెలంగాణలో సబ్ సెంటర్ ద్వారా నాణ్యమైన సముద్ర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. స్థానిక ప్రజలు నాణ్యమైన సముద్ర ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతున్నారని, హైదరాబాదులో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఆక్వా కాంప్లెక్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment