బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి | 40 People Died Due To Sunstroke On Saturday In Bihar | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

Published Sun, Jun 16 2019 10:58 AM | Last Updated on Sun, Jun 16 2019 11:02 AM

40 People Died Due To Sunstroke On Saturday In Bihar - Sakshi

పాట్నా : బీహార్‌ రాష్ట్రంలో భానుడి భగభగలకు మనుషులు పిట్టల్లా నేలకొరుగుతున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు 40మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 70 మంది మృత్యువాత పడ్డారు. ఔరంగా బాద్‌, గయ, నవాడా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో 30 మంది, గయలోని అనురాగ్‌ మగద్‌ మెడికల్‌ కాలేజీలో దాదాపు 10మంది వడదెబ్బ కారణంగా మరణించారు. మరణించిన వారిలో 40 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఉన్నారు.

ఎండల కారణంగా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిచెందిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేంద్రమంత్రి డా. హర్ష వర్ధన్‌ దీనిపై స్పందిస్తూ.. వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించటం దురదృష్టకరమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement