భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
Published Mon, May 22 2017 2:14 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లిన మహిళ వడదెబ్బకు గురై మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. కొత్తగూడెంలోని గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న షేక్ రజ్జబ్ హుస్సేన్- సైదానిబేగంల మూడో పుత్రిక జకియాబేగం వివాహం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన అహ్మద్ పాషాతో నిశ్ఛయమైంది.
ఈ రోజు పెళ్లి జరగనుండగా.. నిన్న(ఆదివారం) పెళ్లి కూతురు తల్లి సైదానిబేగం బంధుమిత్రులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లి వడదెబ్బకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా ఈ రోజు మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరి కాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కూతురి తల్లి మరణించడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Advertisement