వడదెబ్బ తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
వడదెబ్బ తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన గంధమల్ల చిన్నసాయిలు(49) అనే వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లుతున్నారు. రోజువారిలాగే శుక్రవారం గ్రామంలో కూలీ పనులు చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నీళ్లు తాగారు. నీళ్లు తాగిన వెంటనే అవస్థకు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఎల్లమ్మ, ఒక కుమారుడు ఉన్నారు.