
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో గురువారం వడదెబ్బతో 12 మంది మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, హుజూరాబాద్‌లో ఒకరు మరణించారు. వడదెబ్బతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం గునకపల్లిలో చింతల ఓదెలు (60), సంగెం మండలం కాపులకనిపర్తిలో సదిరం ఏలియా(55), నల్లబెల్లి మండలం పద్మాపురంలో తుర్సం పద్మ(45), జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన పాశం చంద్రమౌళి (60), జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి (బి)కి చెందిన కందుల రాజేష్ (40) వడదెబ్బతో మృతి చెందారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల నర్సింహ (36), చందంపేట మండల కేంద్రానికి చెందిన కొండ్రపల్లి శ్రీను(30), కోదాడ పట్టణానికి చెందిన రంగా నర్సింహారావు(71), నకిరేకల్‌లోని ప్రగతినగర్‌కు చెందిన ముత్యాల రాములు(65) ఎండవేడిమికి అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన దామెర్ల రామచంద్రు(50), స్టేషన్ రోడ్‌లోని క్రిస్టిల్ బార్ సందులో చిత్తు కాగితాలు ఏరుకునే భూలక్ష్మి(60), సిద్దిపేట జిల్లా హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామానికి చెందిన నీలం కొమరయ్య(58) వడదెబ్బతో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment